Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నా ఆస్తులన్నీ అమ్మేసి మీ పార్టీకి ఇస్తా: మంచు విష్ణు ఛాలెంజ్
శ్రీవిద్యా నికేతన్ విద్యా సంస్థలకు రావాల్సిన ఫీజు రీమెంబర్స్మెంట్ వివాదం మోహన్ బాబు ర్యాలీ తర్వాత మరింత ముదిరింది. చంద్రబాబు ప్రభుత్వాన్ని రాజకీయంగా దెబ్బతీసేందుకే ఎన్నికల వేళ మోహన్ బాబు ఈ ర్యాలీ తీశారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్న నేపథ్యంలో... సినీ నటులు మంచు విష్ణు, మంచు మనోజ్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.
ఈ ర్యాలీ వెనక, నిరసన వ్యక్తం చేయడం వెనక ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని, విద్యార్థులకు రావాల్సిన బకాయిలు ప్రభుత్వం నుంచి రాబట్టాలనే సదుద్దేశ్యం మాత్రమే ఉందని వారు స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రభుత్వానికి చాలా లెటర్లు రాశామని, ఐఏఎస్ అధికారులను ఈ విషయమై కలిశామని, అయినప్పటికీ ఎలాంటి స్పందన లేదని తెలిపారు. మోహన్ బాబు తమ విద్యా సంస్థలకు రావాల్సిన బకాయిలపై తప్పుడు లెక్కలు చూపిస్తున్నారనే ఆరోపణలపై మంచు విష్ణు సీరియస్ అయ్యారు.
నా ఆస్తులు అమ్మేసి ఇస్తానంటూ మంచు విష్ణు ఛాలెంజ్
విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల గురించి ఐఏఎస్ ఆఫీసర్ రావత్ గారికి చాలా లెటర్స్ రాయడం జరిగింది. మేము ఇచ్చిన లెటర్లో మాకు రావాల్సిన దానికంటే ఒక రూపాయి ఎక్కువ ఉన్నా... నా ఆస్తులన్నీ అమ్మేసి మీ పార్టీ ఫండ్‌గా ఇస్తా ఆ ఛాలెంజుకు మీరు రెడీనా? అంటూ మంచు విష్ణు సవాల్ చేశారు.
మీ డబ్బుతో కాదు... మా నాన్న సంపాదించిన డబ్బుతో
మా నాన్నగారు 25శాతం ఫ్రీ ఎడ్యుకేషన్ కుల మతాలకు అతీతంగా అందిస్తున్నారు. ఈ 25 శాతం ప్రభుత్వం మీరిచ్చే డబ్బులతో కాదు.. మా నాన్న గారు నటుడిగా సంపాదించిన డబ్బులతో అనే నిజాన్ని మాపై ఆరోపణలు చేస్తున్నవారు గుర్తుంచుకోవాలని మంచు విష్ణు తెలిపారు.
మా నాన్న కష్టపడి సంపాదించిన డబ్బు: తిరుపతి ర్యాలీపై మంచు మనోజ్ ఓపెన్ ఛాలెంజ్
మోహన్ బాబుకు అండగా కుటుంబం
తెలుగు దేశం పార్టీకి వ్యతిరేకంగా మోహన్ బాబు ఇదంతా చేస్తున్నారనే ఆరోపణలను ఆయన కుటుంబం ముక్తకంఠంతో ఖండిస్తోంది. మంచు విష్ణుతో పాటు మంచు మనోజ్ ఈ విషయమై సోషల్ మీడియాలో వరుస ట్వీట్స్ చేస్తున్నారు. తమకు రావాల్సిన బకాయిలకు సంబంధించిన డాక్యుమెంట్లను ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు.
మంచు విష్ణు
మంచు విష్ణు సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ‘ఓటర్' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్నికల తర్వాత ఏప్రిల్ మాసంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.