పరిటాల వారసుడిపై మంచు విష్ణు కామెంట్.. మరో యువ నాయకుడిపై కూడా!

Recommended Video

Manchu Vishnu Comments On TDP Leaders | Filmibeat Telugu

మంచు విష్ణు చాలా కాలంగా విజయం కోసం ప్రయత్నిస్తున్నాడు. విష్ణు చివరగా నటించిన ఆచారి అమెరికా యాత్ర చిత్రం నిరాశ పరిచింది. ప్రస్తుతం ఈ మంచువారబ్బాయి నటిస్తున్న చిత్రం ఓటర్. జిఎస్ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకుడు. పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రం తెరక్కుతోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇదిలా ఉండగా మంచు విష్ణు వివిధ సంఘటనల నేపథ్యంలో వార్తల్లో నిలుస్తున్నాడు. మంచు విష్ణు తాజాగా ట్విటర్ లో తెలుగు దేశం పార్టీ తరుపున పోటీ చేయనున్న ఇద్దరు యువ నాయకుల గురించి స్పందించాడు.

 రాజకీయ వారసులు

రాజకీయ వారసులు

త్వరలో జరగబోయే ఎన్నికల్లో చాలా మంది యువ నాయకులు వారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. వారిలో కొందరు రాజకీయ వారసులు ఉన్నారు. మాస్ పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న పరిటాల శ్రీరామ్, దేవినేని అవినాష్ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేయనుండడం ఉత్కంఠగా మారింది. పరిటాల రవి వారసుడిగా శ్రీరామ్, దేవినేని నెహ్రూ తనయుడిగా అవినాష్ ఎన్నికల బరిలో దిగుతున్నారు.

నా సోదరులు

పరిటాల శ్రీరామ్, అవినాష్ ని ఉద్దేశిస్తూ మంచు విష్ణు తాజాగా ట్వీట్ చేశాడు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న నా సోదరులు పరిటాల శ్రీరామ్, అవినాష్ కు నా శుభాకాంక్షలు. వీరిద్దరూ వారి గొప్ప తండ్రుల ఆశయాలని నిలబెడతారని ఆశిస్తున్నట్లు మంచు విష్ణు పేర్కొన్నాడు. పరిటాల రవి, మోహన్ బాబు మంచి మిత్రులు అనే సంగతి అందరికీ తెలిసిందే.

తరచుగా వార్తల్లో

తరచుగా వార్తల్లో

మంచు విష్ణు ఈ మధ్యన తరచుగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ మధ్యన మంచు విష్ణు తన సతీమణి విరోనికతో కలసి వైఎస్ జగన్ ని కలసిన సంగతి తెలిసిందే. ఇటీవల వైఎస్ వివేకానందరెడ్డి మరణించిన నేపథ్యంలో మంచు విష్ణు తన తండ్రి మోహన్ బాబుతో కలసి నివాళులు అర్పించారు. వివేకా మరణంపై వస్తున్న అసత్య ప్రచారాలపై, రాజకీయ విమర్శలపై మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా మండిపడ్డాడు.

పరిటాల రవితో సాన్నిహిత్యం

పరిటాల రవితో సాన్నిహిత్యం

పరిటాల రవి, మంచు కుటుంబం మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. మోహన్ బాబు నటించిన శ్రీరాములయ్య చిత్రాన్ని పరిటాల రవి నిర్మించారు. సందర్భం వచ్చినప్పుడల్లా మోహన్ బాబు తన స్నేహితుడు పరిటాలని గుర్తు చేసుకుంటూనే ఉంటాడు. తాజాగా మంచు విష్ణు పరిటాల శ్రీరామ్ కు శుభాకాంక్షలు తెలపడం వీరిద్దరి కుటుంబాల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X