పవన్ రాజకీయాలపై మంచు విష్ణు కామెంట్స్.. నా తమ్ముడికి సపోర్ట్.. చంద్రగిరిలో పోటీపై క్లారిటీ
కలెక్షన్ కింగ్, నటుడు, హీరో, విలన్ గా గుర్తింపు పొందిన మోహన్ బాబు కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు మంచు విష్ణు. మొదట్లో బాలనటుడిగా సినిమాలు చేసిన 2003 సంవత్సరంలో విష్ణు అనే మూవీతో హీరోగా డెబ్యూ చేశాడు. అప్పటి నుంచి వరుస సినిమాలతో అలరిస్తూ వస్తున్నాడు. ఢీ, దూసుకెళ్తా వంటి సినిమాలతో మంచి విజయం తెచ్చుకున్నాడు. ఇటీవల జిన్నా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మంచు విష్ణు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకియాలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.
భక్త కన్నప్ప: మంచు వారి అబ్బాయిగా తనకుంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు మంచు విష్ణు. ప్రస్తుతం హీరోగా, మా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపడుతున్నాడు. తర్వాత మా ఎన్నికల్లో పోటీ చేయను అని నిర్ణయం తీసుకుని షాక్ ఇచ్చాడు మంచు విష్ణు. ప్రస్తుతం సినిమాలతోనే బిజీగా ఉన్న అతను త్వరలో 'భక్త కన్నప్ప' (Bhaktha Kannappa) మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అలా చెప్పలేను: తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన మంచు విష్ణు ఆసక్తికర విషయాలు తెలిపాడు. "పవన్ రాజకీయాల గురించి చెప్పడానికి నేను ఏమైనా బ్రహ్మంగారినా? పవన్ సినిమాల గురించి అయితే చెప్పగలుగుతాను. సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఆయన సూపర్ స్టార్. అందులో సందేహమే లేదు. పవన్ సినిమా ఒకటి ఆడకపోయినా.. మరో మూవీకి అయినా మంచి కలెక్షన్స్ వస్తాయి. కానీ, ఆయన రాజకీయాల గురించి మాత్రం చెప్పలేను" అని మంచు విష్ణు అన్నారు.

జనాలు చాలా స్మార్ట్: "పాలిటిక్స్ విషయంలో జనాలు చాలా స్మార్ట్ గా ఉన్నారు. సినిమా చూస్తే వేరు. కానీ, ఓటేయాలనుకున్నప్పుడు వాళ్లకు నచ్చిన వ్యక్తికే ఓటేస్తారు. సినిమా రంగానికి చెందిన మహానుభావులు లాంటి వారే రాజకీయాల్లో ఓడిపోయారు. ఒక్కోసారి రాజకీయాల్లో పేరు పొందిన లెజండరీ వ్యక్తులను కూడా ప్రజలు ఓడించారు" అని మంచు విష్ణు చెప్పుకొచ్చారు.
6 నెలలు ఆగితే: "రాజకీయాల ద్వారా ఎవరైతే తమ గ్రామాన్ని, దేశాన్ని, జీవితాన్ని బాగు చేస్తారని నమ్మితే వారివైపే ప్రజలు ఉంటారు. మరో ఆరు నెలలు ఆగితే రాజకీయాల్లో పవన్ భవిష్యత్ ఏంటనేది చెబుతాను. ప్రస్తుతం నా కాన్సంట్రేషన్ సినిమాలపైనే ఉంది. నేను చంద్రగిరిలో పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వారి అబ్బాయి మోహిత్ ను నిలబెడతారు" అని విష్ణు తెలిపారు.

మళ్లీ ఆయనే సీఎం: "మోహిత్ నా తమ్ముడు. అతన్ని నేను చాలా అభిమానిస్తాను. అవసరం అయితే అతనికి సపోర్ట్ చేస్తాను. ఏపీలో నవరత్నాలు పోగ్రామ్ చాలా బాగుంది. దాని వల్ల చాలా మంది పేద ప్రజలు లబ్ధిపొందుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ఏపీలో మళ్లీ ముఖ్యమంత్రిగా అయ్యేది జగన్ మోహన్ రెడ్డి గారే. ఇదే విషయాన్ని దేశంలో పేరొందిన ఎన్నికల సర్వేలన్నీ తెలుపుతున్నాయి" అని మంచు విష్ణు తన అభిప్రాయం చెప్పారు.


Click it and Unblock the Notifications











