దాడి చేసారు, పిండం పెట్టారు : విష్ణు ఫిర్యాదు
హైదరాబాద్ : 'దేనికైనా రెడీ' సినిమాపై బ్రాహ్మణుల వివాదం నేపథ్యంలో హీరో మంచు విష్ణు హెచ్‌ఆర్‌సిలో బ్రాహ్మణులపై శుక్రవారం ఫిర్యాదు చేసారు. తమ ఇంటిపై బ్రాహ్మణులు దాడి చేసారని, తాము బ్రతికుండగానే పిండం పెట్టారని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని విష్ణు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
వాస్తవానికి నిన్ననే విష్ణు ఫిర్యాదు చేయడానికి హెచ్.ఆర్.సి కార్యాలయాన్ని సంప్రదించారు. అయితే హెచ్.ఆర్.సి వైస్ ప్రెసిడెంట్ వేరే పనిలో ఉండటం, సమయం మించి పోవడంతో ఆయన ఫిర్యాదు స్వీకరించలేదు. దీంతో ఆయన శుక్రవారం మళ్లీ వెళ్లి ఫిర్యాదు చేసారు.
ఫిర్యాదు స్వీకరించిన హెచ్.ఆర్.సి... ఈనెల 16లోగా నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ ని ఆదేశించింది. మరో వైపు బ్రాహ్మణులు కూడా నిన్ని హెచ్.ఆర్.సిలో ఫిర్యాదు చేసారు. బ్రాహ్మణులను కించ పరిచే విధంగా ఉన్న దేనికైనారెడీ సినిమాను నిషేధించాలని, తమపై దాడికి ప్రేరేపించిన సినీనటులు మోహన్‌బాబు, విష్ణులతోపాటు దాడి జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ సంఘాలు మానవ హక్కుల సంఘానికి సమర్పించిన ఫిర్యాదులో కోరాయి.
చందాలు అడుక్కోవడానికి వచ్చారంటూ....బ్రాహ్మణుల ఆందోళనపై వ్యంగ్యంగా స్పందించిన మోహన్ బాబు వివాదం ముదిరిన తర్వాత మీడియాతో మాట్లడటానికి ఇష్ట పడటం లేదు. అలాగే సిని పరిశ్రమలో ప్రముఖులు సైతం ఈ వివాదంపై మాట్లాడటానికి ముందుకు రావటం లేదు.


Click it and Unblock the Notifications











