మంచు వారి ఇంటి మహారాణులు (ఫోటో ఫీచర్)
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంట మహారాణుల్లాంటి ఇద్దరు కవల పిల్లలు జన్మించిన విషయం తెలిసిందే. మంచు విష్ణు-వెరోనికా దంపతులకు డిసెంబర్ 3, 2011న వీరు జన్మించారు. ఇప్పటి వరకు వీరి ఫోటోలు బయటకు రాలేదు. తాజాగా వీటిని విన్ని మంచు తన ట్విట్టర్లో పోస్టు చేసింది. అమెరికాలోని న్యూయార్క్ ప్రెస్బిటేరియన్ హాస్పిటల్‌లో వెరోనికా ప్రసవించింది. వెరోనికాకు అమెరికా పౌరసత్వం ఉన్నందున....ఈ ఇద్దరు పిల్లలు కూడా పుట్టుకతోనే అమెరికన్ సిటీజెన్స్ అయ్యారు.
ప్రస్తుతం విష్ణు దేనికైనా రెడీ అనే చిత్రంలో నటిస్తున్నాడు. జి. నాగేశ్వరరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హన్సిక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మంచు లక్ష్మీ నిర్మిస్తారు. కోన వెంకట్ కథను అందిస్తున్న ఈ చిత్రాన్ని యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా నాగేశ్వర రెడ్డి తెరకెక్కించనున్నాడు.
vishnuvardhan babu veronica mohan babu lakshmi prasanna విష్ణువర్థన్ బాబు వెరోనికా మోహన్ బాబు లక్ష్మీ ప్రసన్న


Click it and Unblock the Notifications