మంచు విష్ణు రూ. లక్ష విరాళం

By Bojja Kumar

హీరో మంచు విష్ణు ఏపీ సినీ స్టంట్ డైరెక్టర్స్ అండ్ స్టంట్ ఆర్టిస్ట్ యూనియన్ కోసం రూ. లక్ష విరాళం అదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ జీవితాలను రిస్కులో పెట్టి సినిమాలకు పని చేస్తున్న స్టంట్స్ ఆర్టిస్టుల కుటుంబాల సంక్షేమం కోసం సహాయ పడాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రస్తుతం 'విష్ణు దేనికైనా రెడీ' చిత్రంలోనటిస్తున్నారు. హన్సిక హీరోయిన్. హన్సిక కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్ర చిత్రీకరణ ప్రస్తుతం చివరి దశలో ఉంది, ఈ చిత్రాన్ని ఆగష్టులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఫై మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కోన వెంకట్ కథను అందిస్తున్న ఈ చిత్రాన్ని యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా నాగేశ్వర రెడ్డి తెరకెక్కించనున్నాడు.

టాలీవుడ్ టాప్ కమెడియన్లలో ఒకరైన ఎం.ఎస్ నారాయణ తనయుడు విక్రమ్ ' దేనికైనా రెడీ' సినిమాతో విలన్ గా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. ఈచిత్రానికి టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డబ్బింగ్ చెబుతుండటం మరో ప్రత్యేకత.

ఈ చిత్రానికి కథ- బి.వి.ఎస్.రవి, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, గోపీమోహన్, మాటలు: మరుధూరి రాజా, సంగీతం: చక్రి, ఛాయాగ్రహణం: సిద్దార్థ్ అందిస్తున్నారు. ఎన్.వంశీకృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తెర వెనుక పనిచేస్తున్న వారిలో వర్మ, సెల్వ, రఘు కులకర్ణి, సాయిజ్యోతి, విజయ్ శ్రీనివాస్, సురేష్‌బాబు, నరసింహ, వాసు, సుద్దాల అశోక్‌తేజ, భాస్కరభట్ల,రామజోగయ్యశాస్త్రి తదితరులు ప్రముఖంగా ఉన్నారు. ఇక ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వంశీకృష్ణ, సమర్పణ: శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్, నిర్మాణం: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, నిర్మాత డా.ఎం.మోహన్‌ బాబు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X