ఎన్టీఆర్ 'బాద్‌షా' సెట్స్ పై మంచు విష్ణు
హైదరాబాద్ : మంచు విష్ణు ఇటీవల ఎన్టీఆర్ తాజా చిత్రం బాద్షా సెట్స్ పై దర్శనమిచ్చారు. తన చిత్రం దేనికైనా రెడీ షూటింగ్ కోసం బ్యాంకాక్ వెళ్లిన మంచు విష్ణు అక్కడ ఎన్టీఆర్ ని, దర్శకుడు శ్రీను వైట్లను కలుసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ లో...దేనికైనా రెడీ చిత్రం పాట కోసం బ్యాంకాక్ కి వెళ్లా. అక్కడ నా బ్రదర్ శ్రీను వైట్లను కలిసా..అంతేగాక తారక్ ను కలుసుకున్నారు. చాలా కాలం తర్వాత తారక్ ని కలిసాను. ఆయన ఎప్పటిలాగే ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది అంటూ ట్వీట్ చేసారు. గతంలో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన డీ చిత్రంలో మంచు విష్ణు నటించారు. ఆ సినిమా ఇద్దరి కెరీర్స్ కు మంచి గుర్తింపు తెచ్చింది.
'ఢీ'తో తొలి విజయాన్ని ఢీ కొట్టిన మంచు విష్ణుకు ఆ తర్వాత అలాంటి హిట్టు దక్క లేదు. దీంతో ఇప్పుడు 'దేనికైనా రెడీ' అంటున్నారు. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో డా.మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంచి టైమింగ్‌తో కామెడీని పండించగలనని 'ఢీ' సినిమాతో నిరూపించారు విష్ణు. అలాగే కామెడీ సినిమాలను తెరకెక్కించడంలో జి.నాగేశ్వరరెడ్డిది అందెవేసినచెయ్యి. మరి ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే అది ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఎంటర్‌టైన్ చేస్తుందో చూడాలి. అందాలతార హన్సిక ఇందులో కథానాయిక. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వంశీకృష్ణ, సమర్పణ: శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్, నిర్మాణం: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, నిర్మాత డా.ఎం.మోహన్ బాబు.
ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం 'బాద్‌షా'. ఈ చిత్రంలో విలన్ గా నెగిటివ్ పాత్రలో యంగ్ హీరో నవదీప్ కనిపించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ పాత్ర సినిమాలో ఊహించని విధంగా సాగి నవ్వులు పండిస్తూ కీలకమై నిలుస్తుంది అంటున్నారు. అలాగే కెరిర్ చివరి దశలో ఉన్న నవదీప్ కు ఈ పాత్ర బూస్ట్ ఇస్తుంది. అతనికి ఈ సినిమా చాలా మైలైజి ఇచ్చి వరస ఆఫర్స్ తెచ్చి పెట్టే విధంగా సాగుతుందని చెప్పుకుంటున్నారు.
ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ పాత్ర కూడా డిఫెరెంట్ గా ఉంటుంది. ఆ పాత్ర గురించి చెబుతూ నిర్మాత బండ్ల గణేష్...సేవకుడిగా కాదు.... పాలకుడిగా బతకడమే అతనికిష్టం. బుల్లెట్‌లా కాదు, దాని లక్ష్యాన్ని శాసించే ట్రిగ్గర్‌లా ఉండడమే అతనికిష్టం. అందుకే తనకు తానే 'బాద్‌షా' అని ప్రకటించుకొన్నాడు. ఇంతకీ ఎవరతను? అతని లక్ష్యమేమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు బండ్ల గణేష్.


Click it and Unblock the Notifications











