చిన్న వయస్సులో 'మా' ఉపాధ్యక్షుడిగా మంచు విష్ణు
హైదరాబాద్: మూవిస్ ఆర్టిస్ట్స్ అశోసియేషన్... (మా)కి వైస్ ప్రెసెడెంట్ గా ఎంపిక అయ్యారు. ఇక మూవీ ఆర్టిస్ట్స్ అసోనియేషన్ (మా) అధ్యక్షునిగా మురళీ మోహన్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యిన సంగతి తెలిసిందే. మురళీ మోహన్ ఈ పదవికి ఇప్పటికి వరుసగా రెండు సార్లు ఎంపికయ్యారు. కోశాధికారిగా కోట, శివాజీ రాజా పోటీపడుతున్నారు. ప్రధాన కార్యదర్శి పదవికి ఆహుతి ప్రసాద్, గణేష్ పోటీపడుతున్నారు.
మా వైస్ ప్రెసెడెంట్ గా మంచు విష్ణు ఎంపికకావటం పట్ల అన్ని వర్గాలు నుండి అభినందనలు అందుతున్నాయి.అలాగే మురళీ మోహన్ బయిట ఎటువంటి రాజకీయాల్లో పాల్గొన్నా సినిమా దగ్గరకు వచ్చేసరికి నిష్పక్షపాతంగా వ్యవహించారని, సంస్ధ నిధులను దుర్వినియోగం చేయకుండా సక్రమంగా ఖర్చుపెట్టి, ఆపదసమయంలో పేద కళాకళారులను ఆదుకోవటానికి చర్యలు తీసుకున్నాయని,ఇవన్నీ తిరిగి ఎంపిక కావటానికి అర్హతగా నిలిచాయని సీనీయర్స్ వ్యాఖ్యానించారు.
రీసెంట్ గా... కామెడీ ఎంటర్టైనర్ 'దేనికైనా రెడీ'తో విజయం అందుకొన్న మంచు విష్ణు ఇప్పుడు మరోసారి వినోదం పంచడానికి సిద్ధమవుతున్నారు. విష్ణు హీరోగా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. అందాల రాక్షసి చిత్రంతో పరిచయమైన లావణ్య హీరోయిన్. వీరూపోట్ల దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్‌బాబు నిర్మాత. ఈ చిత్రం తిరుపతి సమీపంలోని చంద్రగిరిలో ప్రారంభమైంది.


Click it and Unblock the Notifications











