కాజల్ అక్కయ్య అంటూ.. హీరోయిన్‌తో వరుస మార్చేసిన మంచు విష్ణు
టాలీవుడ్ హీరో విష్ణు మంచు నిర్మాతగా మారి తెలుగు, ఇంగీష్ భాషల్లో తెరకెక్కిస్తున్న చిత్రం మోసగాళ్లు. ఈ సినిమా మార్చి 19 తేదీన మోహన్‌బాబు పుట్టిన రోజున రిలీజ్ అవుతున్నది. ఈ క్రమంలో సినిమా యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మోహన్‌బాబు, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, కాజల్ అగర్వాల్, రానా దగ్గుబాటి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా..

మా అక్కయ్యగా కాజల్
విష్ఠు మంచు మాట్లాడుతూ... మా అక్కయ్య కాజల్ అగర్వాల్‌కు స్పెషల్ థ్యాంక్స్. మెయిన్ స్ట్రీమ్ సినిమాలో టాప్ హీరోయిన్‌గా కొనసాగే స్టార్ అక్క పాత్రను చేయడమంటే సాహసమే. సాధారణంగా చెల్లెలు పాత్ర అయినా ఓకే అనుకొంటారు. ఒక హీరోకు అక్కయ్యగా నటించడమంటే చాలెంజ్ లాంటిదే అని అన్నారు.

కథ వినగానే కాజల్ ఒకే
నేను మోసగాళ్లు కథ పంపించగానే చదివి వెంటనే ఓకే చెప్పారు. కథ చాలా బావుంది. అను క్యారెక్టర్ నాకు నచ్చింది. అయితే కథలో అర్జున్ పాత్రను ఎవరు చేస్తున్నారనే ప్రశ్న వస్తే నేనే చేస్తున్నానని చెప్పాను. నీకేమైనా భయంగా ఉందా అంటూ ప్రశ్నించింది. అయితే గేమ్ ఆఫ్ థ్రోన్ చిత్రంలో బ్రదర్, సిస్టర్ మాదిరిగా చేయాలనుకొన్నాం. ఆ చిత్రంలో అన్నా, చెల్లెల్లు హీరోయిన్లు అంటూ మంచు విష్ణు వివరణ ఇచ్చారు.

మోసగాళ్లకు ముందు సింగిల్‌గా
మోసగాళ్లు సినిమా షూటింగ్ ప్రారంభమయ్యేటప్పుడు ఆమె సింగిల్. ఇప్పుడు పెళ్లి చేసుకొని మింగిల్ అయిపోయారు. కరోనా పరిస్థితులు చూసిన తర్వాత కాజల్‌కు పిల్లలు పుట్టిన తర్వాత సినిమా రిలీజ్ అవుతుందని భయపడ్డాను. కానీ అలాంటి లేకుండానే మోసగాళ్లు రిలీజ్ అవుతుంది అని విష్ణు మంచు ఫన్నీగా కామెంట్స్ చేశారు.

పెళ్లి తర్వాత నా తొలి సినిమా అంటూ కాజల్
అంతకుముందు కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. నా పెళ్లి తర్వాత థియేటర్లో రాబోతున్న తొలి సినిమా ఇది. నా మ్యారేజ్ తర్వాత ప్రేక్షకుల ముందుకు ఇలా వస్తున్నాను. కోవిడ్ సమయంలో అందరం ఇబ్బంది పడ్డాం. ఎంతో కష్టపడి సినిమాను పూర్తి చేశాం. మోసగాళ్లు సినిమాను తప్పకుండా థియేటర్లలోనే చూడండి అంటూ సూచించారు.

మోహన్‌బాబు ప్రోత్సాహంతో
మోసగాళ్లు సినిమా షూటింగు సమయంలో మోహన్‌బాబు, సునీల్ శెట్టి అందించిన సహకారం మరువలేనిది. మా వెంటే ఉంటూ మమల్ని చాలా ప్రోత్సహించారు. ఈ సినిమా 2020లో రిలీజ్ చేయాలని అనుకొన్నాం. కానీ కరోనా వల్ల వాయిదా పడింది. చివరకు 2021లో రిలీజ్ కాబోతున్నది అని కాజల్ అగర్వాల్ అన్నారు.


Click it and Unblock the Notifications











