twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విన్నీతో పెళ్లి తర్వాత...., నా వల్ల కోటి నష్టం, అందరికీ సారీ: మంచు విష్ణు

    By Bojja Kumar
    |

    మంచు విష్ణు, ప్రగ్యాజైశ్వాల్‌ జంటగా నటించిన చిత్రం 'ఆచారి అమెరికా యాత్ర'. జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు. ఈ సినిమా ప్రీరిలీజ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో దర్శకుడు కె.రాఘవేంద్రరావు, వి.వి.వినాయక్‌, మంచు విష్ణు, బ్రహ్మానందం, జి.నాగేశ్వరరెడ్డి, సి.కళ్యాణ్‌, ప్రగ్యాజైశ్వాల్‌, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో మంచు విష్ణు మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

     విన్నితో పెళ్లి తర్వాత ఆయనతోనే

    విన్నితో పెళ్లి తర్వాత ఆయనతోనే

    ఈ సినిమా రూపొందడానికి ముఖ్య కారణం పి.డి.ప్రసాద్‌గారే. బ్రిలియంట్‌ స్క్రిప్ట్‌. నాగేశ్వరరెడ్డిగారితో మంచి అనుబంధం ఉంది. విన్నీని పెళ్లి చేసుకున్న తర్వాత నేను నెక్ట్స్ పెళ్లి చేసుకున్నది ఆయన్నే అనుకుంటా... అంతలా గొడపడుతూ ఉంటాం.... అని విష్ణు సరదా వ్యాఖ్యలు చేశారు.

    అమెరికాలో ఏం జరుగకూడదో అన్నీ జరిగాయి

    అమెరికాలో ఏం జరుగకూడదో అన్నీ జరిగాయి

    అమెరికాలో ఏం జరుగకూడదో అన్నీ జరిగాయి. వెదర్ సహకరించలేదు. లొకేషన్ సహకరించలేదు. అక్కడ జరిగే కన్ఫ్యూజన్‌కు, కిట్టూ పెట్టే టెన్షన్‌కు... కీర్తి ఒక్కర్తే తట్టుకుని సినిమాను ప్రొడ్యూస్ చేసింది... అని విష్ణు తెలిపారు.

     సారీ చెప్పాలనుకుంటున్నాను... అందుకే

    సారీ చెప్పాలనుకుంటున్నాను... అందుకే

    ఆ రోజు మలేషియాలో యాక్సిడెంట్ జరుగడానికి కారణం నేనే. లొకేషన్ వెళ్లిన తర్వాత బైక్ చూశాను. అది తేడాగా అనిపించింది. ఇది చేయను అని నాగేశ్వర్ రెడ్డిగారితో గట్టిగానే మాట్లాడాను. కానీ షూటింగ్ క్యాన్సిల్ చేస్తే పది నుండి 15 లక్షలు లాస్ అవుతుంది ఏదో ఒకటి చేద్దామని చేశాను.... అదే నేను చేసిన పెద్ద తప్పు. అందుకే నా ఫ్యామిలీకి, అభిమానులకు, నాతో పాటు గాయపడ్డ ప్రగ్యాకు సారీ చెబుతున్నాను అని విష్ణు తెలిపారు.

     నా వల్ల కోటి నష్టం వచ్చింది

    నా వల్ల కోటి నష్టం వచ్చింది

    సంవత్సరం పాటు నేను స్టంట్స్ లో ట్రైన్ అయ్యాను. ఏడాదిపాటు ఆ విభాగంలో పనిచేశా. మొదట్లో ఫైట్‌ మాస్టర్‌నే అవుతాననుకొన్నా. అలాంటి నేను, స్టంట్స్‌ గురించి అన్నీ తెలిసిన నేను సెట్‌లో ప్రమాదానికి గురయ్యా. నేను ఆరోజు ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిసి చేశాను. నేను ఒక వేళ ఆ రోజు చేయను అని ఉండి ఉంటే నిర్మాతకు కోటి రూపాయలు నష్టం వచ్చి ఉండేది కాదు.... అని విష్ణు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో త్వరలో విడుదల చేస్తామని విష్ణు తెలిపారు.

     బ్రహ్మణులను కించ పరిచే సీన్లు లేవు

    బ్రహ్మణులను కించ పరిచే సీన్లు లేవు

    ''నేను, విష్ణు చేసిన దేనికైనా రెడీ సినిమా విడుదల తర్వాత కొన్ని సమస్యలను ఎదుర్కొంది. మళ్లీ బ్రాహ్మణులపై సినిమా అంటే వద్దనే అనుకున్నాను. కానీ మంచి టీం కుదరడంతో సినిమా చేశాను. ఇందులో ఎవరినీ కించపరిచే సన్నివేశాలు లేవు. ఢీ, దేనికైనా రెడీ సినిమాలు తర్వాత విష్ణు, నేను కలిసి చేసిన సినిమా. తమన్‌ మంచి సంగీతాన్ని, నేపథ్య సంగతాన్ని అందించారు'' అన్నారు.

     అల్లరి మొగుడు గుర్తుకు వస్తుంది

    అల్లరి మొగుడు గుర్తుకు వస్తుంది

    కె.రాఘవేంద్రరావు ''దర్శకుడు నాగేశ్వరరెడ్డి అంటే ఎంటర్‌టైన్‌మెంట్‌. సినిమా పెద్ద విజయాన్ని సాధించి మంచి పేరు తెచ్చి పెట్టాలి. ఈ సినిమా స్టిల్స్‌ చూస్తుంటే.. నాకు నేను, మోహన్‌బాబు, బ్రహ్మానందం చేసిన అల్లరిమొగుడు సినిమా గుర్తుకు వస్తుంది. చిత్ర యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

    విష్ణు-బ్రహ్మానందం కామెడీ హైలెట్

    విష్ణు-బ్రహ్మానందం కామెడీ హైలెట్

    "ఆచారి అమెరికా యాత్ర" ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ముఖ్యంగా విష్ణు-బ్రహ్మానందం కాంబినేషన్లో వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచనున్నాయి.

     కాన్సెప్టు అదే

    కాన్సెప్టు అదే

    బ్రహ్మానందం, విష్ణు, ప్రభాస్ శ్రీను, ప్రవీణ్ ఈ చిత్రంలో పూజారులుగా నటిస్తున్నారు. అమెరికా వెళితే ఆదాయం ఎక్కువ ఉంటుందనే ఆశతో వెళ్లిన వారు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనే కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

    పద్మజ పిక్చర్స్

    పద్మజ పిక్చర్స్

    పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తి చౌదరి, కిట్టు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎల్.కుమార్ చౌదరి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

    తెరవెనక

    తెరవెనక

    టెక్నీషియన్స్ ఈ చిత్రానికి కథ: మల్లాది వెంకటకృష్ణమూర్తి, ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, కళ: కిరణ్, ఫైట్స్: వెంకట్, డ్యాన్స్: ప్రేమ్ రక్షిత్-దినేష్-గణేష్, కాస్ట్యూమ్స్: నరసింహ, లిరిక్స్: భాస్కరభట్ల, పబ్లిసిటీ డిజైన్స్: కృష్ణ ప్రసాద్, స్టిల్స్: రాజు, మాటలు: డార్లింగ్ స్వామి, స్క్రీన్ ప్లే: విక్రమ్ రాజ్-నివాస్-వర్మ, సంగీతం: శేఖర్ చంద్ర, ఛాయాగ్రహణం: సిద్దార్థ, నిర్మాతలు: కీర్తి చౌదరి-కిట్టు, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జి.నాగేశ్వర్రెడ్డి!

    English summary
    Watch Manchu Vishnu Emotional Speech at Achari America Yatra Pre Release Event. Achari America Yatra Movie, Directed by G Nageswar Reddy. Music by SS Thaman. Produced by Kirthi Chowdary and Kittu Under the banner Padmaja Pictures, Starring Vishnu Manchu, Pragya Jaiswal, Brahmandam and Anoop Singh Thakur.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X