విదేశాల్లో ఇరుక్కుపోయిన మంచు విష్ణు ఫ్యామిలీ.. ఎట్టకేలకు వందల రోజుల తరువాత ఇండియాకు!
మంచు విష్ణు ఫ్యామిలీ లాక్ డౌన్‌లో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. గత మూడు నెలలుగా వారంతా సింగపూర్‌లోనే ఉంటున్న విషయం తెలిసిందే. అయితే మంచు విష్ణు మాత్రం గత నెలలో మోహన్ బాబు బర్త్ డే సెలెబ్రేట్ చేసేందుకు ఇండియాకు వచ్చాడు. కానీ ఆయన కుటుంబం మాత్రం అక్కడే ఉండాల్సి వచ్చింది. తాజాగా ఆయన కుటుంబం నేడు ఇండియాకు వచ్చింది. ఈ మేరకు విరానిక సోషల్ మీడియాలో తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

ఇండియాకు రప్పించే కార్యక్రమం..
భారత దేశంలో ఉన్న వలస కార్మికులు వారి వారి సొంత ఊర్లకు పంపించే కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. అలాగే విదేశాల్లో చిక్కుకున్న మన భారతీయులను స్వదేశాన్ని తీసుకొచ్చేందుకు వందే భారత్ అనే కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం చేపట్టింది.

మళయాలీ హీరో సైతం..
షూటింగ్ నిమిత్తం మలయాళ హీరో, దర్శకుడు పృథ్వీరాజ్ జోర్డాన్‌లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా విజృంభణ నేపథ్యంలో ఆయన అక్కడే ఉండాల్సి వచ్చింది. వందే భారత్ మిషన్‌లో భాగంగా పృథ్వీరాజ్ ఇటీవలె కేరళకు తిరిగి వచ్చాడు.

ఇండియాకు మంచు విష్ణు ఫ్యామిలీ..
మంచు విరానిక సోషల్ మీడియాలో స్పందిస్తూ..‘వంద రోజుల తర్వాత సింగపూర్ నుంచి ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి చేరుకోవడానికి సహకరించిన వందేభారత్ మిషన్, ఎయిర్ ఇండియా, సింగపూర్ బృందానికి కృతజ్ఞతలు'అని పేర్కొంది.

ఒంటరిగా విష్ణు..
అయితే ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇలాంటి విపత్కర పరిస్థితిలో తాను ఫ్యామిలీతో లేకపోవడం చాలా బాధకరంగా ఉందని తెలిపాడు. రీసెంట్ ఓ పోస్ట్ చేస్తూ.. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను.. త్వరలోనే కలుస్తాను అని పేర్కొన్నాడు. మొత్తానికి మంచు విష్ణు తన ఫ్యామిలీని కలుసుకోబోతన్నాడు.


Click it and Unblock the Notifications











