నాంపల్లి కోర్టుకు మంచు విష్ణు
హైదరాబాద్: సినీ నటుడు, దేనికైనా రెడీ చిత్రం కథానాయకుడు మంచు విష్ణు నాంపల్లి కోర్టులో ప్రైవేట్ పిటీషన్ దాఖలు చేసాడు. ఈ మేరకు నాంపల్లి కోర్టు విష్ణు వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. 'దేనికైనా రెడీ' సినిమా వివాదం నేపథ్యంలో కొందరు బ్రాహ్మణులు మోహన్ బాబు కుటుంబానికి పిండ ప్రధానం చేసిన నేపథ్యంలో విష్ణు ఈ ప్రైవేటు పిటీషన్ దాఖలు చేసారు. మొత్తం 16 మందిపై విష్ణు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
విష్ణు నాంపల్లి కోర్టుకు వచ్చేప్పుడు ఆయన చుట్టూ భారీ భద్రత వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. దేనికైనా రెడీ వివాదం నేపథ్యంలో ఓలాంటి అవాంఛనీయ సంఘటన జరుగకుండా ఉండేందుకే విష్ణు తన చుట్టు భారీ భద్రత వలయాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు స్పష్టం అవుతోంది. కాగా మరో వైపు హైకోర్టులో 'దేనికైనా రెడీ' వివాదానికి సంబంధించిన పిటీషన్ దాఖైన నేపథ్యంలో విచారణ ప్రారంభైమంది.
కాగా... 'దేనికైనా రెడీ' చిత్రంలో బ్రాహ్మణులను కించపరిచే, అవమానించే సన్నివేశాలు ఏమీ లేవని ప్రాంతీయ సెన్సార్ బోర్డు మరోసారి తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాయి. ఈ మేరకు మానవ హక్కుల సంఘానకి ఇచ్చిన నివేదికలో ఇదే విషయాన్ని పొందు పరిచాయి. రెండు కమిటీలు దేనికైనా రెడీ చిత్రాన్ని పరిశీలించాయని, ఇందులో ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవని పేర్కొడనడంతో పాటు, ఈ చిత్రం మంచి సామాజిక సంబంధాలు కలిగిన చిత్రంగా పేర్కొన్నాయి.


Click it and Unblock the Notifications











