మంచు విష్ణు వివాదం కొత్త మలుపు.. దర్శకుడి కట్టుకథలు.. అసెంబ్లీ రౌడీని అలా చేశారంటూ

Recommended Video

New Twist In Manchu Vishnu's Voter Movie Controversy || Filmibeat Telugu

హీరో మంచు విష్ణుపై దర్శకుడు కార్తీక్ రెడ్డి చేసిన ఆరోపణలపై విజయ్ కుమార్ రెడ్డి స్పందించారు. దర్శకుడు కార్తీక్ రెడ్డి చేసిన ఆరోపణలు, విమర్శల్లో వాస్తవం లేదని ఆయన వివరణ ఇచ్చారు. ఓటర్ సినిమా వివాదంలో తనను బెదిరిస్తున్నట్టు మంచు విష్ణు, ఆయన స్నేహితుడు విజయ్ కుమార్ రెడ్డిపై కార్తీక్ రెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కార్తీక్ రెడ్డి ఆరోపణలపై విజయ్ కుమార్ రెడ్డి స్పందించడంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. ఇంతకు విజయ్ కుమార్ రెడ్డి ఏమని వివరణ ఇచ్చారంటే..

కార్తీక్ రెడ్డి చేసిన ఆరోపణ

కార్తీక్ రెడ్డి చేసిన ఆరోపణ

మంచు విష్ణు, విజయ్ కుమార్ రెడ్డిపై కార్తీక్ రెడ్డి ఆరోపణలు చేస్తూ... హీరో మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ చిత్రానికి, తాను రాసుకొన్న ఓటర్ సినిమా కథకు ఎలాంటి సంబంధం లేదు. అసెంబ్లీ రౌడీ కథను ఓటర్ సినిమాకు అడాప్ట్ చేయడానికి బలవంతంగా తప్పుడు అగ్రిమెంట్ చేయించుకొన్నారు. తనను బెదిరించి మంచు విష్ణు, విజయ్ కుమార్ రెడ్డి అగ్రిమెంట్ పేపర్లపై తనతో సంతకాలు చేయించుకొన్నారు అని అన్నారు.

 మంచు విష్ణు స్నేహితుడు విజయ్ కుమార్ రెడ్డి స్పందన

మంచు విష్ణు స్నేహితుడు విజయ్ కుమార్ రెడ్డి స్పందన

కార్తీక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విజయ్ కుమార్ రెడ్డి వివరణ ఇస్తూ... ఆయన చెప్పినవన్నీ కట్టుకథలు. ఓటర్ సినిమా ప్రారంభించే ముందు కథపై కొన్ని సందేహాలు తలెత్తాయి. దాంతో కథపై మంచు విష్ణు, నిర్మాతలు, దర్శకుడు కార్తీక్ చర్చలు, కసరత్తు చేశారు. అసెంబ్లీ రౌడీ స్క్రీన్ ప్లే మాదిరిగా ఉంటే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారు. దానికి కొంత ప్రతిఫలం ముట్టజెపుతామనే నిర్ణయానికి వచ్చారు అని తెలిపారు.

అసెంబ్లీ రౌడీ స్క్రీన్ ప్లేను

అసెంబ్లీ రౌడీ స్క్రీన్ ప్లేను

దర్శకుడు, నిర్మాతల మధ్య కుదిరిన అవగాహన మేరకే ఆ సమయంలో అగ్రిమెంట్ రాసుకొన్నాం. అసెంబ్లీ రౌడీ స్క్రీన్ ప్లేను వాడుకొన్నందుకు విడుదలకు ముందు ఆ మొత్తం చెల్లిస్తానని దర్శకుడు ఒప్పుకొన్నాడు. ఇప్పుడు ఆ మొత్తం గురించి అడిగితే సంబంధం లేదని నిర్మాతలు బుకాయిస్తున్నారు. నిర్మాతల పేరు చెప్పి కార్తీక్ రెడ్డి కూడా చేతులు ఎత్తేశారు అని విజయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

 దర్శకుడిని కోర్టుకు ఇడుస్తాం

దర్శకుడిని కోర్టుకు ఇడుస్తాం

దర్శకుడు, నిర్మాతల వ్యవహార తీరు వివాదాస్పదంగా ఉండటంతో సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని చూశాం. పదిరోజులు చూసిన తర్వాత ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేశాం. మా ఫిర్యాదు ఆధారంగా కార్తీక్‌ను వివరణ అడిగారు. అందుకు రెండు వారాలు సమయం కావాలని అడిగాడు. ఈ మధ్యలో మంచు విష్ణుపై ఆరోపణలు చేస్తూ కట్టుకథలు చెబుతున్నాడు. అతనిపై కేసు వేసి కోర్టు ఇడ్చాం అని విజయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

 వివాదంతో విడుదల వాయిదా

వివాదంతో విడుదల వాయిదా

రాజకీయ వ్యంగ్యాస్త్రంగా మలిచిన ఓటర్ చిత్రాన్ని కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో జాన్ సుధీర్ పూదోట నిర్మించాడు. ఈ చిత్రంలో మంచు విష్ణు, సురభి, సుప్రీత్, పోసాని, బ్రహ్మాజీ తదితరులు నటించారు. ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. వాస్తవానికి ఈ చిత్రం ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సింది. వివాదం కారణంగా వాయిదా పడినట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X