For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ అమ్మాయికి ఏ కష్టం కలగకుండా...: మంచు విష్ణు

    By Srikanya
    |

    హైదరాబాద్: "ప్రేమించడం ఒక్కటే తెలిస్తే సరిపోదు. ఆ ప్రేమను పెళ్లి పీటల దాకా తీసుకెళ్లే ధైర్యం కూడా ఉండాలి. నమ్మకంతో వెంట నడిచిన ఆ అమ్మాయికి ఏ కష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత కూడా తీసుకోవాలి. అలా అన్నింటికీ సిద్ధపడ్డ ఓ యువకుడి కథే మా చిత్రం" అంటున్నారు మంచు విష్ణు. ఆయన హీరోగా నటించిన చిత్రం 'దేనికైనా రెడీ'. హన్సిక హీరోయిన్. మోహన్‌బాబు నిర్మాత. జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు. నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకొన్నాయి.

    'ఢీ' చిత్రంతో ప్రేక్షకులకు నవ్వుల్ని పంచిన మంచు విష్ణు.. 'దేనికైనా రెడీ' అంటూ మరోమారు ప్రేక్షకులను నవ్వించడానికి సిద్ధమయ్యారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై డా.మోహన్‌బాబు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా నాగేశ్వరరెడ్డి ఈ చిత్రాన్ని మలిచారని, అలరించే కథ, కథనాలు, విష్ణు అభినయం, హన్సిక అందం ఈ చిత్రానికి ప్రధాన బలాలుగా నిలువనున్నాయని మోహన్‌బాబు చెప్పారు.

    దర్శకుడు మాట్లాడుతూ ''ఆద్యంతం వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఒక యువకుడు తన ప్రేమను గెలిపించుకోవడానికి ఎలాంటి సాహసాలు చేశాడు? అనే విషయం తెరపైనే చూడాలి. విష్ణు నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఆయన్ను కొత్తకోణంలో చూపించే ప్రయత్నం చేశాము. చక్రి, యువన్‌శంకర్‌రాజా స్వరసారథ్యంలో ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది, సినిమా విజయం తథ్యం'' అన్నారు

    ఈ చిత్రం కథ గురించి దర్శకుడు చెపుతూ...ఆడుతూపాడుతూ జీవితాన్ని గడిపేసే కుర్రాడతను. ఓ అందాల భామను చూసి ప్రేమలోపడ్డాడు. ఆమె ఇంట్లోవాళ్లు సంప్రదాయాలూ... పద్ధతులూ అంటూ సవాలక్ష నిబంధనలు విధిస్తూ ఉంటారు. వాళ్లందరినీ ఒప్పించి ప్రేమను గెలిపించుకొనేందుకు అతగాడు దేనికైనా సిద్ధపడతాడు. మరి ఫలితం ఏ రీతిన వచ్చిందో తెర మీదే చూడమంటున్నారు. మంచి టైమింగ్‌తో కామెడీని పండించగలనని 'ఢీ' సినిమాతో నిరూపించారు విష్ణు. అలాగే కామెడీ సినిమాలను తెరకెక్కించడంలో జి.నాగేశ్వరరెడ్డిది అందెవేసినచెయ్యి...వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఏ రేంజిలో ఎంటర్టన్ చేస్తుందో ఊహించుకోమంటున్నారు నిర్మాతలు.

    ఈ చిత్రానికి కథ- బి.వి.ఎస్.రవి, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, గోపీమోహన్, మాటలు: మరుధూరి రాజా, సంగీతం: చక్రి, ఛాయాగ్రహణం: సిద్దార్థ్ అందిస్తున్నారు. ఎన్.వంశీకృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తెర వెనుక పనిచేస్తున్న వారిలో వర్మ, సెల్వ, రఘు కులకర్ణి, సాయిజ్యోతి, విజయ్ శ్రీనివాస్, సురేష్‌బాబు, నరసింహ, వాసు, సుద్దాల అశోక్‌తేజ, భాస్కరభట్ల,రామజోగయ్యశాస్త్రి తదితరులు ప్రముఖంగా ఉన్నారు. ఇక ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వంశీకృష్ణ, సమర్పణ: శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్, నిర్మాణం: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, నిర్మాత డా.ఎం.మోహన్‌బాబు.

    English summary
    
 Vishnu Manchu's forthcoming film 'Denikaina Ready' will be relesing on October 24th. Produced by Mohan Babu under his banner 24 Frames Factory, the movie is about to finish all post-production formalities.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X