చెవి పోగు, టాటూ అంటూ మంచు విష్ణు పబ్లిసిటీ!
హైదరాబాద్: సినిమాల్లో నటించడమంటే ఆషా మాషీ వ్యవహారం కాదు. డెడికేషన్ చాలా ప్రధానం. అలాంటి డెడికేషన్ చూపిస్తున్న హీరోల్లో ఫస్ట్ లైన్ లో కూర్చుని కనిపిస్తారు....అంటూ ఆయన నటిస్తున్న మంచు విష్ణు సినిమాకు పబ్లిసిటీ ప్రారంభించారు ఆ సినిమా యూనిట్ సభ్యులు. ఆయన తాజాగా దేవా కట్టా దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను నిర్మించేది కూడా విష్ణునే.
తమిళనాడులో సూపర్ హిట్ అయిన ‘అరిమా నంబి'కి రీమేక్ ఈ సినిమా. ఈ చిత్రం కోసం ఇటీవల విష్ణు చెవి పోగు కుట్టించుకున్న సంగతి తెలిసిందే. జీవితంలో తొలిసారిగా తన చేతికి టాటూ పొడిపించుకున్నారు. అదీ చిన్నా చితకా ఎంబ్లమ్ కాదు. ఏకంగా చేతి నిండా టాటూలు వేయించుకున్నారట. ఇలా టాటూలు వేయించుకోవడం ఓ సాహసం అంటూ....అభివర్ణిస్తున్నారు పబ్లిసిటీ విభాగం సభ్యులు.

ఇటీవలే ఈచిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి సంబంధించి హీరో విష్ణు లుక్ చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ లుక్ కి అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. హీరో కొత్త లుక్ లో కనబడితే బావుంటుందని భావించిన డైరెక్టర్ దేవాకట్టా తన ఆలోచనని విష్ణుకి తెలియజేయడం, సినిమాల్లో తన పాత్ర, లుక్ పరంగా భిన్నంగా కనబడాలనుకునే హీరో విష్ణ దానికి సరేననడం జరిగిందట. మరి మంచు విష్ణు చెవి పోగు, ఆయన చేతిపై వేయించుకున్న టాటూలు సినిమా విజయానికి ఏ మేరకు తోడ్పడతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











