twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నటనకు పనికొస్తానా?.. లేదా?.. 'గాయత్రి'తో డిసైడ్ అవుతుంది: మంచు విష్ణు

    |

    Recommended Video

    Vishnu Manchu interview about Gayatri movie

    'దూసుకెళ్తా..' తర్వాత మంచు విష్ణు కెరీర్‌లో సరైన హిట్టు లేదు. మధ్యలో 'పాండవులు పాండవులు తమ్మెద' తప్ప వచ్చిన సినిమాలు వచ్చినట్లే పోయాయి. ఇప్పుడు తన ఆశలన్నీ 'గాయత్రి', 'ఆచారి అమెరికా యాత్ర'ల పైనే.

    'గాయత్రి'లో మోహన్ బాబు యుక్తవయసు పాత్రలో కనిపించబోతున్న విష్ణు.. సినిమాలో తన పాత్ర కచ్చితంగా ఆకట్టుకుంటుందన్న నమ్మకంతో ఉన్నాడు. ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో.. ఇక తాను నటనకు పనికొస్తానా?.. లేదా?.. అన్నది తేలిపోతుందని ఓ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చేశాడు..

     ఈ సినిమాతో డిసైడ్ అవుతుంది:

    ఈ సినిమాతో డిసైడ్ అవుతుంది:

    నటుడిగా నేనేంటో నిరూపించుకునే చిత్రమిది. నటనకు పనికివస్తానా? లేదా? అన్నది ఈ సినిమాతో డిసైడ్ అయిపోతుంది. నేను చేసిన క్యారెక్టర్‌పై నమ్మకంతోనే ఈ మాట చెబుతున్నా.

    సినిమాలో నేను కనిపించేది 15 నిమిషాలే అయినా కథను నా పాత్ర ప్రభావితం చేస్తుంది. నటుడిగా నాకు మర్యాదను తీసుకొచ్చే సినిమా ఇది.

     నటుడిగా నాకు సవాల్ విసిరిన పాత్ర..:

    నటుడిగా నాకు సవాల్ విసిరిన పాత్ర..:

    ఒకే ఇమేజ్‌లో ఇరుక్కుపోకుండా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ఉండే పాత్రల్లో చేయాలనుకుంటున్నా. సినిమా అంతా ఒకే తీవ్రతతో కూడిన పాత్రలో నటించాలనే కోరిక 'అనుక్షణం'తో తీరింది. ఇప్పుడు మళ్లీ 'గాయత్రి'తో నాలోని నటుడికి సవాల్ విసిరే పాత్ర దొరికింది.

     మోహన్ బాబు యుక్త వయసు పాత్రలో..:

    మోహన్ బాబు యుక్త వయసు పాత్రలో..:

    'గాయత్రి'లో నాన్న రెండు పాత్రల్లో కనిపిస్తారు. ఒకటి పూర్తి పాజిటివ్ కోణంలో సాగితే.. మరొకటి ప్రతినాయక ఛాయలతో నెగటివ్ గా సాగుతుంది. రెండూ వేటికవే భిన్నంగా ఉంటాయి.

    ఇక నా విషయానికొస్తే.. నాన్న పాత్రలో కనిపించడానికి ఆయన బాడీలాంగ్వేజ్, హావభావాలను అనుకరించకుండా నా శైలిలో నటించాను. ఆయన స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా నటించడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. భయాలేవి పెట్టుకోకుండా నటించాను.

     గాయత్రి 'కథ'..:

    గాయత్రి 'కథ'..:

    తండ్రి-కూతుళ్ల మధ్య జరిగే కథ ఇది. కూతురి కోసం ఓ తండ్రి పడే తపనను దర్శకుడు మదన్ హృద్యంగా తెరపై ఆవిష్కరించారు. పాత్రల మధ్య నాటకీయతను చక్కగా చూపించారు. నాకు, శ్రియకు మధ్య వచ్చే సన్నివేశాలు బ్యూటీఫుల్‌గా అనిపిస్తాయి.

     బ్రాహ్మణుల నేపథ్యంలో సినిమాపై:

    బ్రాహ్మణుల నేపథ్యంలో సినిమాపై:

    రాజకీయ ఉద్దేశాలతోనే కొందరు దేనికైనా రెడీ సినిమాను అడ్డుకున్నారు. బ్రాహ్మణుల్ని కించపరిచే సన్నివేశాలున్న చాలా సినిమాల్ని వదిలిపెట్టి మా చిత్రంపై పడ్డారు. వినోదాన్మి నమ్మే ఆ సినిమా చేశాం తప్ప మరొకటి కాదు.

    ఆ సినిమాతో ఎదురైన అనుభవాల దృష్ట్యా ఆచారి అమెరికా యాత్ర చిత్రీకరణలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. కులానికి, మతాలకు వ్యతిరేకంగా వుండే సన్నివేశాలు ఇందులో కనిపించవు. బారిష్టర్ పార్వతీశం నవల అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి కామెడీ కథతో సినిమా చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. ఆ కోరిక ఈ సినిమాతో తీరింది.

     తీరిక సమయాల్లో..:

    తీరిక సమయాల్లో..:

    క్లబ్, పబ్‌లకు వెళ్లే అలవాటు లేదు. సినిమాలే నా ప్రపంచం. కొత్త కథలు వినడం.. టెక్నాలజీ పరంగా సినీ రంగంలో వస్తున్న మార్పులను తెలుసుకోవడం.. ఇదే నా పని. తీరిక సమయాల్లో పిల్లలతో గడుపుతాను.

    నా పిల్లలకు ఫేవరేట్ హీరోను నేనే. నాన్నతో చనువుగా ఉన్నా.. ఆయనంటే తెలియని భయం వారిలో ఉంటుంది. ఆచారి అమెరికా యాత్ర సినిమా చూసి 'నాన్న యూ ఆర్ వెరీ ఫన్నీ'అన్నారు(నవ్వుతూ..).

    English summary
    Vishnu Manchu is gearing up to hit the screens this feb 9th with Gayatri. Vishnu appears as young Mohan Babu in the movie. He is so confident on that character.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X