»   »  మనోజ్ పెళ్లి: గర్నవర్ విద్యాసాగర్ రావుకు మంచు విష్ణు ఆహ్వానం

మనోజ్ పెళ్లి: గర్నవర్ విద్యాసాగర్ రావుకు మంచు విష్ణు ఆహ్వానం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు ప్రముఖుడు, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావును టాలీవుడ్ యాక్టర్ మంచు విష్ణు కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందజేసారు. మే 20వ తేదీన తన సోదరుడు మంచు మనోజ్ వివాహం నేపథ్యంలో ఆయన్ను మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వానించారు.

ఇటీవలే మనోజ్ నిశ్చితార్థం ప్రణతి రెడ్డితో జరిగిన సంగతి తెలిసిందే. మార్చి 4, ఉదయం 10.30 గంటలకు ఎంగేజ్మెంట్ జరిగింది. మనోజ్-ప్రణతి వివాహానికి పురోహితులు మే 20వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు. మే 20వ తేదీ ఉదయం 9.10 గంటలకు వీరి వివాహం జరగనుంది. మరో విశేషం ఏంటంటే మనోజ్ పుట్టిన రోజు కూడా మే 20వ తేదీయే. ప్రణతి రెడ్డిని మనోజ్ ప్రేమ వివాహం చేసుకుంటున్నాడు.

కాబోయే కోడలి గురించి మోహన్ బాబు స్వయంగా వెల్లడించారు ''మా పెద్ద కోడలు విరానికా, ప్రణతి ఇద్దరూ క్లాస్ మెట్స్. ఆ విధంగా ప్రణతి తల్లిదండ్రులకూ, మా కుటుంబానికీ పరిచయం ఏర్పడింది. ప్రణతి బిట్స్ పిలానీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివింది. ఆ తర్వాత న్యూయార్క్ లో సీపీఎ (అమెరికాలో చార్టెడ్ ఎకౌంట్ ని సిపీఎ అంటారు) చేసింది. రెండు రోజుల క్రితం ప్రణతి తల్లిదండ్రులు సత్యనారాయణ, ప్రవీణలను కలిసి వివాహ విషయం మాట్లాడాం. మీ అందరి ఆశీస్సులతో ఈ పెళ్లి జరుగుతుంది'' అని చెప్పారు.

స్లైడ్ షోలో ఫోటోలు...

ఆహ్వానం

ఆహ్వానం


మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుకు వివాహ ఆహ్వాన పత్రిక అందజేస్తున్న విష్ణు.

మనోజ్ వివాహం

మనోజ్ వివాహం


మే 20వ తేదీన తన సోదరుడు మంచు మనోజ్ వివాహం నేపథ్యంలో ఆయన్ను మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వానించారు.

వివాహం

వివాహం


మే 20వ తేదీ ఉదయం 9.10 గంటలకు వీరి వివాహం జరగనుంది. మరో విశేషం ఏంటంటే మనోజ్ పుట్టిన రోజు కూడా మే 20వ తేదీయే.

ప్రేమ వివాహం

ప్రేమ వివాహం


ప్రణతి రెడ్డిని మనోజ్ ప్రేమ వివాహం చేసుకుంటున్నాడు.

English summary
Manchu Vishnu Photos with Hon'ble Governor of Maharashtra ShriCh Vidyasagar Rao.
Please Wait while comments are loading...