‘కన్నప్ప’ శివలింగం కాంట్రవర్సీ... అక్షయ్ కుమార్ సీరియస్.. అసలు ఏమైంది?

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా 'కన్నప్ప' చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విష్ణు కెరీర్ లో ఈ ఫిల్మ్ భారీ స్కేల్లో నిర్మితమవుతోంది. మంచు మోహన్ బాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ హిస్టారికల్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. ఎలాగైనా మంచు ఫ్యామిలీని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ లో ఉంచేందుకు మోహన్ బాబు, విష్ణు ఈ ప్రాజెక్ట్ తో ప్రయత్నాలు చేస్తున్నారు. దేశమంతా ప్రశంసలు అందుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే భారీ తారగణంతో 'కన్నప్ప' షూటింగ్ ను జరిపిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం న్యూజిలాండ్ లో షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. చిన్నచిన్న వర్క్ కంప్లీట్ కాగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టనున్నారు. ఈ క్రమంలో ఇప్పటి నుంచే 'కన్నప్ప' పై అంచనాలను పెంచేందుకు తగినట్టుగా ప్రమోషన్స్ ను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. టీజర్, 'శివా శివా శంకర' అనే సాంగ్ కు ఊహించని విధంగా రెస్పాన్స్ దక్కుతోంది. అయితే ఎప్పటిలాగే మంచు విష్ణు సినిమాపై విమర్శలు గుప్పించే పనిలో కొందరు నిమగ్నమయ్యారు.

Manchu Vishnu Kannappa Movie Shivling Controversy Bollywood star Akshay Kumar Reaction Over it

ఈ క్రమంలో 'శివా శివా శంకరా' సాంగ్ లో శివుడిని తిన్నడు కౌగిలించుకోవడం, ముట్టుకోవడం, నోటితో నీరు పోసి అభిషేకం చేయడం చూశాం. అలాగే హిందీలో 'మహాకాళ్ ఛలో' అంటూ ఓ స్పెషల్ సాంగ్ ను విడుదల చేశారు. ఇందులో అక్షయ్ కుమార్ శివుడిని కౌగిలించుకోవడం పట్ల పలువురి నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. పవిత్రమైన శివలింగాన్ని మానవులు అలా ముట్టుకోవడం సరేనా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఇక రీసెంట్ గా మహాశివరాత్రి 2025 సందర్భంగా 'కన్నప్ప' టీమ్ ఓ స్పెషల్ టీజర్ ను విడుదల చేసింది. ఆ సందర్భంగా అక్షయ్ కుమార్ కు, విష్ణు ఇదే ప్రశ్న ఎదురైంది.

దీనిపై బాలీవుడ్ స్టార్ స్పందించారు. శివుడు దేవుడు. అంటే మన తల్లిదండ్రులకు సమానం. తండ్రి తన బిడ్డను తాకడం ఎక్కడా తప్పు కాదని అభిప్రాయపడ్డారు. అలాగే శివుడిని తాను తాకం తప్పేమీ కాదని భావిస్తున్నట్టు తెలిపారు. మనకు ఎక్కడి నుంచైతే శక్తి వస్తుందో దాన్ని పవిత్రమైన మనస్సుతో తాకడం తప్పేమీ కాదని వివరణ ఇచ్చారు. ఇక దీనిపైనా మంచు విష్ణు కూడా స్పందించారు. శ్రీకాళహస్తి, అలాగే మరిన్ని టెంపుల్స్ లోనూ కన్నప్ప శివుడిని తాకడం చేసుకోవచ్చు. కొన్ని టెంపుల్స్ లో కన్నప్ప పాదం శివుడిపై ఉన్న చిత్రాలు చూడొచ్చాని చెప్పుకొచ్చారు.

తన భక్తుడు ప్యూర్ హార్ట్ తో చేసే పునులేవీ దేవుడికి ప్రియమైనవేనని చెప్పుకొచ్చారు. ఇక శివుడిని హగ్ చేసుకోవడం అంటే.. మార్కండేయాను యమరాజు తీసుకెళ్లడానికి వచ్చిన సమయంలో అతను శివుడిని హగ్ చేసుకుని కనిపిస్తాడు. దీంతో శివుడి నుంచి మార్కండేయాను తీసుకెళ్లే శక్తి తనకు లేదని తిరిగి వెళ్లిపోతాడని వివరిస్తాడు. అలాగే ప్రతిదానికి ఒక అర్థమిచ్చే సన్నివేశాలే చిత్రంలో ఉన్నాయని చెప్పుకొచ్చారు.

ఇక 'కన్నప్ప' 2025 ఏప్రిల్ 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్ బాబు ఈ చిత్రాన్ని రూ.100 కోట్లు వెచ్చించి నిర్మిస్తున్నారు. కాగా.. రుద్రగా ప్రభాస్, శివుడిగా అక్షయ్ కుమార్, కిరాతగా మోహన్ లాల్, పార్వతీగా కాజల్ అగర్వాల్ కామియో అప్ఫీయరెన్స్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అప్డేట్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ హిస్టారికల్ డ్రామాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ... ఇంగ్లీష్ లోనూ గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. స్టీఫెన్ దేవాసీ అందిస్తున్న సంగీతం ఆకట్టుకుంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X