»   » మంచు విష్ణు... తెలంగాణ వ్యతిరేక పుస్తకావిష్కరణ

మంచు విష్ణు... తెలంగాణ వ్యతిరేక పుస్తకావిష్కరణ

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ఆ మధ్య మోహన్ బాబు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనడంతో....ఆయన తనయుడు విష్ణు నటించిన 'సలీమ్" సినిమా తెలంగాణలో నిలిపి వేసిన విషయం తెలిసిందే. ఫలితంగా చాలా నష్టపోయారు. తాజాగా మరోసారి మోహన్‌బాబు కుటుంబానికి తెలంగాణ ఉద్యమ సెగ తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ప్రచురితమైన 'ఎకె 140" అనే పుస్తకం మంచు విష్ణు చేతుల మీదుగా ఆవిష్కరించ బడటమే ఇందుకు కారణం.

  టైమ్స్ ఆఫ్ ఇండియాలో జర్నలిస్టుగా పని చేస్తున్న ప్రశాంత్ భట్ అనే వ్యక్తి ఈ పుస్తకాన్ని రచించినట్లుగా తెలుస్తోంది. ప్రశాంత్ స్వస్థలం మంగళూరు, అతని మాతృభాష తులు. ట్విట్టర్ ద్వారా చాలా యాక్టివ్ ఉండే ప్రశాంత్ విష్ణుకు సన్నహితుడు, తాను ట్వట్టర్ లో తెలంగాణ వ్యతిరేకంగా ట్వీటిన ట్వీట్లన్నీ కలిపి ఒక పుస్తకంగా రూపొందించారు. బహుషా ప్రశాంత్ తెలంగాణకు వ్యతిరేకంగా ట్విట్టర్‌లో ట్వీటడం మంచు విష్ణుకు బాగా నచ్చిందో ఏమో? ఆ చనువుతోనే ఈ పుస్తకాన్ని విష్ణు చేతుల మీదుగా ఆవిష్క రింప చేసినట్లు సమాచారం. బయట రాష్ట్రాల నుంచి తెలంగాణకు వ్యతిరేకంగా విడుదలైన పుస్తకాలలో ఇదే మొదటి కావడం గమనార్హం.

  English summary
  Times Of India film journalist Prashanth is very active in twitter. Prashanth came up with strong anti-Telangana views. Most of his tweets regarding the T-issue were logical, sensible, well analyzed and practical for non Telangana sympathizers but for Telangana activists those sound blasphemous.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more