Manchu Vishnu:పాన్ ఇండియా మూవీ మొదలెట్టిన మంచు విష్ణు... తన డ్రీమ్ ప్రాజెక్టుతో వచ్చేస్తున్నాడుగా!

మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మంచు మోహన్ బాబు వారసుడిగా టాలీవుడ్ లోకి విష్ణు అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఇక వరుసగా సినిమాలు చేసుకుంటూ ప్రత్యేక గుర్తింపు అయితే తెచ్చుకున్నారు. ఇక ఆయన తన డ్రీమ్ ప్రాజెక్టు అయినటు వంటి కన్నప్ప చిత్రాన్ని ఈరోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. త్వరలో చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. ఆ వివరాల్లోకి వెళితే...

మంచు మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు మంచు విష్ణు. తొలిచిత్రం విష్ణు మూవీతోనే ఫిల్మ్ ఫేర్ బెస్ట్ మేల్ డెబ్యూ సౌత్ అవార్డును అందుకున్నారు. ఈ సినిమా తర్వాత విష్ణు.. ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు అనేక చిత్రాలు చేశారు. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద అవి బోల్తా పడుతూ వచ్చాయి. ఇక శ్రీను వైట్ల దర్శకత్వంలో ఢీ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Manchu Vishnu launched his dream project Pan India Movie Kannappa film today at Srikalahasti

ఢీ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లు రాబట్టింది. ఇక ఈ మూవీలో విష్ణు యాక్టింగ్ కూడా మంచి మార్కులు పడ్డాయి. జెనిలియా హీరోయిన్ గా నటించగా శ్రీహరి, మోహన్ బాబు, బ్రహ్మనందం, ప్రేమ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీతో స్టార్ హీరో అయిపోతారు అనుకున్నారు. కానీ మళ్లీ విష్ణుకు ఫ్లాప్స్ వస్తూనే ఉన్నాయి. గత ఏడాది జిన్నా అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా... ఫలితం మాత్రం రాలేకపోయింది.

Manchu Vishnu launched his dream project Pan India Movie Kannappa film today at Srikalahasti

ఇక మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టారు. డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' చేయబోతున్నారు. ఈ రోజు పూజ కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. చాలా రోజులుగా ఈ సినిమా కథ మీద పని చేస్తున్న విష్ణు... 'కన్నప్ప' చిత్రాన్ని శ్రీ కాళహస్తిలో పూజ కార్యక్రమాలతో మొదలు పెట్టారు. త్వరలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం.

Manchu Vishnu launched his dream project Pan India Movie Kannappa film today at Srikalahasti

కన్నప్ప చిత్రం అత్యంత భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను నిర్మించడానికి మంచు విష్ణు సన్నాహాలు చేస్తున్నారు. తన తండ్రి నటుడు, నిర్మాత మోహన్ బాబు ఈ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మహాభారత సిరీసుకి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. కృతి సనాన్ సోదరి నుపుర్ సనన్ విష్ణు మంచు సరసన హీరోయిన్ గా నటించనున్నారు.

Manchu Vishnu launched his dream project Pan India Movie Kannappa film today at Srikalahasti

కన్నప్ప చిత్రానికి పరుచూరి గోపాలకృష్ణ గారు, బుర్ర సాయి మాధవ్, తోట ప్రసాద్ వంటి రచయితలు ఈ చిత్ర కథకు మెలికలు దిద్దారని తెలుస్తోంది. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి మ్యూజిక్ అందించనున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో, హై టెక్నికల్ స్టాండర్డ్స్ తో రూపొందనుంది. ఈ తరానికి తగ్గట్లు ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ టాప్ నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నట్టు సమాచారం. మరిన్నీ విషయాలు త్వరలో వెల్లడించనున్నట్లు చిత్రబృంద తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X