ఓటర్ వివాదంలో మరో ట్విస్ట్... కోర్టుకెక్కిన మంచు విష్ణు.. దర్శక, నిర్మాతలకు షాక్!
మంచు విష్ణు నటించిన ఓటర్ సినిమా వివాదం మరో మలుపు తిరిగింది. ఈ వివాదంపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మంచు విష్ణు.. దర్శక, నిర్మాతలకు నోటీసులు పంపించాడు. దీంతో ఈ వివాదం వేడి ఇప్పట్లో చల్లారేటట్టు కనిపించడం లేదు. మంచు విష్ణు నోటీసులకు దర్శక, నిర్మాతలు కూడా ధీటుగా స్పందించడానికి సిద్దమవుతున్నట్టు తెలుస్తున్నది. వివరాల్లోకి వెళితే..

తప్పుడు అగ్రిమెంట్‌తో బెదిరింపులు
హీరో మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ చిత్రానికి, తాను రాసుకొన్న ఓటర్ సినిమా కథకు ఎలాంటి సంబంధం లేదు. అసెంబ్లీ రౌడీని ఓటర్ పేరుతో అడాప్ట్ చేయడానికి బలవంతంగా తప్పుడు అగ్రిమెంట్ చేయించుకొన్నారు. తనను బెదిరింరి మంచు విష్ణు, విజయ్ కుమార్ రెడ్డి అగ్రిమెంట్ పేపర్లపై తనతో సంతకాలు చేయించుకొన్నారు. ఓటర్ చిత్రం పూర్తయిన తర్వాత సినిమా చూశాడు. సినిమా అద్భుతంగా రావడంతో కథకు మంచి పేరు వస్తుందని భావించాడు. ఆ తర్వాత కథ, స్క్రీన్‌ప్లే క్రెడిట్స్‌ను తనకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. నేను ఒప్పుకోకపోతే నన్ను బెదిరించాడు. ఆయన బెదిరింపులు, ఒత్తిడి తట్టుకోలేక స్క్రీన్ ప్లే రైటర్‌గా మంచు విష్ణు పేరు వేశాం అని దర్శకుడు కార్తీక్ రెడ్డి, నిర్మాత పూదోట శ్రీధర్ కుమార్ ఆరోపించారు.

దర్శక, నిర్మాత తప్పుడు ఆరోపణలని
అయితే దర్శక నిర్మాతల ఆరోపణల్లో వాస్తవం లేదని మంచు విష్ణు స్నేహితుడు విజయ్‌కుమార్ రెడ్డి స్పందించాడు. దర్శక, నిర్మాలు చెప్పినవన్నీ కట్టుకథలు. ఓటర్ సినిమా ప్రారంభించే ముందు కథపై కొన్ని సందేహాలు తలెత్తాయి. దాంతో కథపై మంచు విష్ణు, నిర్మాతలు, దర్శకుడు కార్తీక్ చర్చలు, కసరత్తు చేశారు. అసెంబ్లీ రౌడీ స్క్రీన్ ప్లే మాదిరిగా ఉంటే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారు. దానికి కొంత ప్రతిఫలం ముట్టజెపుతామనే నిర్ణయానికి వచ్చారు. రిలీజ్ ముందు డబ్బు చెల్లించేందుకు నిరాకరిస్తూ వివాదం చేస్తున్నారు అని అన్నారు.

దర్శక, నిర్మాతలకు నోటీసులు
తమతో చేసుకొన్న ఒప్పందాన్ని ఉల్లంఘించినందున్న దర్శక, నిర్మాతలకు 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ తరపున విజయ్ కుమార్ రెడ్డి నోటీసులు పంపారు. వివాదం కోర్టులో ఉన్నందున.. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు సినిమాను రిలీజ్ చేయడానికి వీలు లేదని సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది.

నిర్మాత, దర్శకులు హాజరుకాకపోతే
కోర్టు నోటీసుల నేపథ్యంలో మే 3వ తేదీన కోర్టు ముందు హాజరు కావాలని, ఈ కేసును 805 సెక్షన్ కింద విచారించనున్నట్టు నోటీసుల్లో పేర్కొన్నారు. ఒకవేళ హాజరు కావడంలో విఫలమైతే కోర్టు విచక్షణాధికారం, చట్టాలను అనుసరించి తీర్పు ఉంటుంది అని నోటీసుల్లో వెల్లడించారు.


Click it and Unblock the Notifications











