For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  MAA Elections మీరు అలా చేస్తే పోటీ నుంచి తప్పుకొంటా.. చిరంజీవి, బాలకృష్ణకు మంచు విష్ణు సంచలన లేఖ

  |

  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఇంకా మూడు నెలలు ఉండగానే టాలీవుడ్‌లో రచ్చ మామూలుగా మొదలు కాలేదు. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, నరేష్ వర్గాలు ఒకరిపై మరొకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేశారు. మా ప్రతిష్ట బజారున పడే సూచనలు కనిపిస్తుండటంతో యువ హీరో మంచు విష్ణు ఎమోషనల్‌గా సుదీర్ఘమైన లేఖను రిలీజ్ చేశారు. అందులోని కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఏమిటంటే..

  ఘాటు ఫోజులతో రెచ్చిపోయిన అనుష్క శర్మ: విరాట్ కోహ్లీ భార్యను ఇంత గ్లామర్‌గా ఎప్పుడూ చూసుండరు!

  మా అసోసియేషన్ పుట్టింది అలా

  మా అసోసియేషన్ పుట్టింది అలా

  నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయాలని నిర్ణయం తీసుకొన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. పూర్వం మద్రాసులో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం నటులందరికీ కలిపి నడిగర్ సంఘం ఉండేది. తెలుగు సినీ నటీనటులకంటూ ప్రత్యేకంగా అసోసియేషన్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో 'తెలుగు సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్' ఏర్పాటు చేశారు. తెలుగు సినీ నటీనటుల కష్టసుఖాలు తెలిసిన తెలుగువారే అధ్యక్షులుగా ఉంటు చాలా మంచి పనులు చేశారు. తెలుగు సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ను అద్భుతంగా నడిపారు. ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ రావడం, 1993లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ను అక్కినేని నాగేశ్వరరావు, ప్రభాకర్ రెడ్డి, మోహన్‌బాబు, చిరంజీవి మరికొంతమంది పెద్దలు కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. నాన్న మోహన్ బాబు 'మా' పదవిలో ఉన్నా, లేకపోయినా సినీ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉన్నారు.

  బడా రాజకీయ నేత కబ్జా

  బడా రాజకీయ నేత కబ్జా

  1990లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మన సినీ కార్మికులకి నివాసం కల్పిద్దాం అని ఒక స్థలాన్ని కేటాయించింది. 1997లో దాన్ని ఒక పెద్ద రాజకీయ నాయకుడు తన ఫ్యాక్టరీ కోసం సొంతం చేసుకుందామని ప్రయత్నిస్తే, సినీ ప్రముఖులందరూ ఆ విషయం తెలిసి సినీ కార్మికుల తరుపున అప్పటి గవర్నర్ రంగరాజన్‌కు ఫిర్యాదు చేసి అడ్డుకొన్నారు. ఆ స్థలాన్ని సినీ కార్మికులకి చెందేలా చేసారు. అదే ఇప్పుడు మనకున్న చిత్రపురి కాలనీ అని మంచు విష్ణు తన లేఖలో పేర్కొన్నారు.

  ప్రసిడెంట్‌గా పోటీ చేయమని

  ప్రసిడెంట్‌గా పోటీ చేయమని

  2015లో దాసరి నారాయణ రావు , మురళీ మోహన్ ఇద్దరు కలిసి నన్ను ప్రెసిడెంట్‌గా పోటీ చేయమని అడిగితే, ఆ రోజు నాన్నగారు అడ్డుపడి ఇప్పుడే ఈ వయసులో ఎందుకు అని నన్ను వద్దని గురువు గారికి సర్ది చెప్పారు. దాంతో నేను పోటీ చేయకూడదని నిర్ణయించుకొన్నారు. ఇప్పటి వరకు మా అధ్యక్షులుగా పనిచేసిన వారు మంచి పనులు చేశారు. ప్రస్తుత అధ్యక్షులు నరేష్ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఎంతో మంది తోటి ఆర్టిస్టులకు అండగా నిలబడి వాళ్ళను ఆదుకొన్నారు. మా అసోసియేషన్‌లో తప్పులు జరుగవచ్చు. కానీ వాటిని తవ్వుకోకుండా ముందుకెళ్లి మంచి పనుల చేయాలని నా అభిప్రాయం అంటూ మంచు విష్ణు తన లేఖలో సూచించారు.

  స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు డబ్బులు ఇస్తానని

  స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు డబ్బులు ఇస్తానని

  మురళీమోహన్ ప్రెసిడెంట్‌గా , నేను వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో జరిగిన జనరల్ బాడీ మీటింగ్‌కి హాజరైన స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మా అసోసియేషన్ కోసం కట్టించబోయే బిల్డింగ్‌కి అయ్యే మొత్తం ఖర్చులో 25 శాతం నేను, నా కుటుంబం ఇస్తాం అని చెప్పారు. 10-12 ఏళ్ళుగా ఆ బిల్డింగ్ కట్టాలని అందరు అంటూనే ఉన్నారు. కానీ అది సఫలం కాలేదు. కానీ ఇప్పుడు మా బిల్డింగ్ నిర్మాణానికి అయ్యే ప్రతి పైసా నేను ఇస్తాను.. నా కుటుంబంతో కలిసి ఆ భవనాన్ని నిర్మిస్తాను అని మంచు విష్ణు అన్నారు.

  మా మరింత స్ట్రాంగ్‌గా

  మా మరింత స్ట్రాంగ్‌గా

  సభ్యులు, సభ్యులు కాని వారు ఇబ్బందుల్లో ఉన్నారు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి గురించి బ్రోచర్ తయారు చేసి ప్రతి ప్రొడక్షన్ హౌజ్, ఓటీటీ చిత్రాలను నిర్మించే వారికి సభ్యులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరాలి. ప్రతి ప్రొడక్షన్ హౌజ్‌కు మా అసోసియేషన్‌కు మధ్య బలమైన సంబంధాలు ఉండాలి. దేశంలోని సినీ అసోసియేషన్స్‌తో మా గట్టి సంబంధాలు కలిగి ఉండాలి. మనమంత నిర్మాతలకు సహకరించాలి. నిర్మాతలు లేకపోతే మనం లేము.. ఇది ప్రతి నటుడు గుర్తుంచుకోవాల్సిన విషయం అని మంచు విష్ణు తన లేఖలో ప్రస్తావించారు.

   పోటీ నుంచి తప్పుకొంటానని

  పోటీ నుంచి తప్పుకొంటానని

  నేను ఇప్పటికీ నమ్మేది ఒక్కటే.. ఇండస్ట్రీ పెద్దలు కృష్ణ, కృష్ణంరాజు, సత్యనారాయణ, మోహన్ బాబు, మురళీమోహన్, బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, జయసుధ, రాజశేఖర్, జీవిత, రాజేంద్రప్రసాద్, కోట శ్రీనివాసరావు, ఇంకా కొంతమంది పెద్దలు కూర్చుని మా' కుటుంబాన్ని నడిపించడానికి ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకొనేలా చర్యలు తీసుకోవాలి. అలా ఎన్నుకుంటే వాళ్ళ నిర్ణయానికి కట్టుబడి పోటీ నుంచి తప్పుకుంటాను. ఏకగ్రీవం కాని పక్షంలో పోటీకి నేను సిద్ధం. పెద్దలను గౌరవిస్తాం. వాళ్ళ సలహాలు పాటిస్తాం. మా తరాన్ని ఆశీర్వదించి.. మా ప్రెసిడెంట్‌గా నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అంటూ మంచు విష్ణు తన ప్రకటనలో వెల్లడించారు.

  MAA 2021 elections: RGV backs PrakashRaj in local non local controversy | Filmibeat Telugu
   కాక పుట్టించిన మంచు విష్ణు

  కాక పుట్టించిన మంచు విష్ణు

  అయితే మంచు విష్ణు లేఖ రాయడం సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఇటీవల కాలంలో మా ఎన్నికల హడావిడి, ప్రెస్ మీట్‌లు తగ్గి వాతావరణం చల్లబడిందని అనుకొంటున్న సమయంలో మంచు విష్ణు లేఖ మరోసారి సినీ వర్గాల్లో కాకపుట్టించింది. అయితే మంచు విష్ణు లేఖ సూచించిన విషయంపై సినీ పెద్దలు సానుకూలంగా స్పందిస్తారా లేదా అనే వేచి చూడాల్సిందే.

  English summary
  Manchu Vishnu writes letter for unanimous in MAA elections. Movie Artist Association (MAA) Elections to held soon. Report suggest that Actress Jeevitha Rajasekhar to contest President against Prakash Raj and Manchu Vishnu. Already Prakash raj seek support from Chiranjeevi, Nagababu and others.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X