మంచు విష్ణు కొత్త చిత్రం ప్రారంభం
మంచు విష్ణువర్థన్ బాబు, హన్సిక జంటగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ట్వంటీఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్‌కు సమీపంలోని గచ్చిబౌలిలో ప్రారంభమైంది. శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రం ముహూర్తపు షాట్‌ను విష్ణుపై చిత్రీకరించారు. తొలి సన్నివేశానికి మంచు మనోజ్ క్లాప్‌నిచ్చారు. రచయిత గోపీమోహన్ స్విచ్చాన్ చేశారు. మోహన్‌బాబు యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నిరాడంబరంగా ప్రారంభమైన ఈ చిత్రం ప్రారంభోత్సవంలో డా.మోహన్‌బాబు, శ్రీమతి నిర్మల, కోన వెంకట్, బీవీఎస్వ్రి, మరుధూరి రాజా, చక్రి వంటి సినిమాకి సంబంధించిన యూనిట్ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. హీరోగా నటిస్తూ విష్ణువర్థన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం.
ఆద్యంతం వినోదభరితంగా ఈ చిత్రం రూపొందుతుందని, 'ఢీ' తర్వాత ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఈ చిత్రం తన కెరీర్‌లో నిలుస్తుందని విష్ణు తెలిపారు. ఈ చిత్రానికి కథ- బి.వి.ఎస్.రవి, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, గోపీమోహన్, మాటలు: మరుధూరి రాజా, సంగీతం: చక్రి, ఛాయాగ్రహణం: సిద్దార్థ్ అందిస్తున్నారు. ఎన్.వంశీకృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తెర వెనుక పనిచేస్తున్న వారిలో వర్మ, సెల్వ, రఘు కులకర్ణి, సాయిజ్యోతి, విజయ్ శ్రీనివాస్, సురేష్‌బాబు, నరసింహ, వాసు, సుద్దాల అశోక్‌తేజ, భాస్కరభట్ల,రామజోగయ్యశాస్త్రి తదితరులు ప్రముఖంగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











