‘ఎర్రబస్సు’ఎక్కుతున్న మంచు విష్ణు

By Srikanya

హైదరాబాద్ : పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్లని, కొద్దిగా అమాయకంగా ఉండేవాళ్ళని 'ఎర్రబస్సు'ఎక్కి వచ్చాడురా అంటారు. ఇప్పుడు అదే టైటిల్ తో మంచు విష్ణు హీరోగా చిత్రం రూపొందుతోంది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందే చిత్రంలో మంచు విష్ణు ...ఆయనకు మనవడుగా నటిస్తున్నాడు. లింగుస్వామి సమర్పణలో రూపుదిద్దుకొన్న 'మంజ పై' చిత్రం రీమేక్ హక్కులు డాక్టర్ దాసరి నారాయణరావు కైవసం చేసుకొన్నారు. ఆ చిత్రంమే ఇది. ఈ చిత్రంలో కేథరిన్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ నెల 30 వ తేదీనుంచి షూటింగ్ జరగనుంది.

తమిళనాడులో ప్రభంజనం సృష్టిస్తున్న ఈ చిత్రం రీమేక్ హక్కుల కోసం తెలుగులో తీవ్రమైన పోటీ ఏర్పడగా, ఫాన్సీరేటు చెల్లించి ఆ హక్కుల్ని తన సొంతం చేసుకొన్నారాయన. తాత, మనవళ్ల మధ్య అనుబంధాన్ని సరికొత్త రీతిలోదర్శకుడు రాఘవన్ ఈ సినిమాలో ఆవిష్కరించారు. తాతగా రాజ్‌కిరణ్, మనవడిగా విమల్ నటించారు. ఇప్పుడు 'మంజ పై' చిత్రాన్ని తెలుగులో తీయాలని దాసరి నిర్ణయించుకోవడం ఆసక్తికర పరిణామం. ఎందుకంటే సుదీర్ఘమైన తన కెరీర్‌లో దాసరి రీమేక్స్ చేసిన సందర్భాలు అరుదనే చెప్పాలి. తారకప్రభు ఫిలిమ్స్ పతాకంపై రూపుదిద్దుకొనే ఈ చిత్రానికి దర్శకుడు దాసరి, అలాగే తాత పాత్రలోనూ దాసరే కనపడనున్నారు.

Manchu Vishnu next ‘Erra Bus’

కథలో ఆర్ద్రత ఉంటే సగటు ప్రేక్షకుడు సైతం నీరాజనం పడతాడనటానికి ఇదొక ఉదాహరణ. రెండు వారాల క్రితం తమిళంలో విడుదలైన 'మంజాపై' ఘన విజయాన్ని సాధించి.. కమర్షియల్‌గా కొత్త పుంతలు తొక్కింది. ఎన్.రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తాతా-మనవళ్ల అనుబంధం తాలూకు హృద్యమైన కథనం. పూర్తి స్థాయి హాస్య ప్రధానాంశంగానూ.. మరోవైపు సెంటిమెంట్‌ని వొలకబోసి రూపొందిన ఈ చిత్రంలో రాజ్ కిరణ్, విమల్, లక్ష్మీ మీనన్ నటించారు. లోబడ్జెట్ సినిమా.

కానీ ఇరవై కోట్ల పైచిలుకు వసూళ్లు చేస్తోందని అంచనా. పర భాషలో ఏ కథైనా 'హిట్' కొట్టిందా? రీమేక్ అంటూ టాలీవుడ్ ఉవ్విళ్లూరటం పరిపాటి. రీమేక్ హక్కుల కోసం లగడపాటి శ్రీధర్, సూపర్‌గుడ్ ఫిలింస్ సంస్థ ఎంతగా ప్రయత్నించినప్పటికీ 'దాసరి' ఫ్యాన్సీ రైట్స్‌తో ఆ చిత్రాన్ని కొనేశాడు. 'మంజాపై' తాతామనవళ్ల కథ. 150 చిత్రాల చరిత్ర కలిగిన దాసరి సినీ కెరీర్ కూడా 'తాతా-మనవడు' నుంచీ ఆరంభం కావటం యాదృచ్ఛికం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X