బెల్లంకొండతో వివాదం... ఏం జరిగిందో వివరించిన మంచు విష్ణు

By Srikanya

హైదరాబాద్ :నాగచైతన్య, నాగేశ్వరరెడ్డి కాంబినేషన్‌లో ఓ సినిమా చేస్తానని ఇద్దరికీ బెల్లంకొండ సురేశ్‌ అడ్వాన్స్‌ ఇచ్చారు. అయితే పదినెలలైనా ఆ సినిమా మొదలు పెట్టలేదు. నాగచైతన్య ఇంకో సినిమాకి వెళ్లిపోయాడు. ‘దేనికైనా రెడీ' వంటి హిట్‌ సినిమా తర్వాత నాగేశ్వరరెడ్డి ఆ సినిమాను నమ్ముకొని ఖాళీగా ఉన్నారు. ఆ తర్వాత తన అడ్వాన్స్‌ తిరిగివ్వమని బెల్లంకొండ అడిగితే ‘ఈ పదినెలల కాలం నాకు నష్టపరిహారం ఎవరిస్తారు?' అని నాగేశ్వరరెడ్డి అడిగారు. పెద్దలు కూర్చొని మాట్లాడితే రూ. పది లక్షలు ఇవ్వడానికి ఆయన సిద్ధమయ్యారు. కానీ తనకు రూ. 20 లక్షలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు బెల్లంకొండ.నాగేశ్వరరెడ్డిపై కేసు వేశారు. అంటూ బెల్లంకొండ తో వివాదం గురించి చెప్పుకొచ్చారు మంచు విష్ణు.

Manchu Vishnu on Bellamkonda Issue


అలాగే మనోజ్‌తో సినిమా చేస్తానని అతనికి అడ్వాన్స్‌ ఇచ్చారు. అతనితో సినిమా చెయ్యలేదు. తన సినిమా షూటింగ్‌ కోసం మా గంధర్వమహల్‌ సెట్‌ను వాడుకొని, దాని రెంట్‌ ఇవ్వకుండా ‘మనోజ్‌కు అడ్వాన్స్‌ ఇచ్చాను కాబట్టి, అతని వద్ద తీసుకొమ్మ'ని లక్ష్మితో చెప్పారు బెల్లంకొండ.

తనకు చెప్పి మనోజ్‌కు అడ్వాన్స్‌ ఇవ్వలేదు కాబట్టి, మనోజ్‌తో వ్యవహారం మనోజ్‌తోనే చూసుకొమ్మనీ, గంధర్వమహల్‌ రెంట్‌తో దాన్ని ముడిపెట్టొద్దనీ లక్ష్మి చెప్పింది. అలా ఆ వ్యవహారం వివాదమైంది. బెల్లంకొండ కావాలనుకుంటే ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌లోనో, ‘మా'లోనో ఫిర్యాదు చెయ్యొచ్చు కదా. ఎందుకు చెయ్యలేదు? అని ప్రశ్నించారు మంచు విష్ణు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X