కాస్టింగ్ కౌచ్ ఇష్యూ: మమ్మల్ని కలిపేశారా? ‘మా’ తీరుపై విష్ణు లేఖాస్త్రం

By Bojja Kumar

తెలుగు సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉద్యమం తీవ్రతరం అయిన నేపథ్యంలో కొన్ని రోజులుగా పరిశ్రమలో చోటు చేసుకున్న విషయాలు ఆందోళన కరంగా ఉన్నాయంటూ హీరో మంచు విష్ణు 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్'‌ అధ్యక్షుడు శివాజీ రాజాకు ఓ లేఖ సంధించారు. మొత్తం వ్యవహారాన్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సరిగా డీల్ చేయలేదని ఆయన తన లేఖ ద్వారా అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాతల ఇష్టానుసారం నటీనటులను ఎంపిక చేస్తారన్న విష్ణు.... పలానా వారితో నటించవద్దని 'మా' ఎలా చెబుతుందని ధ్వజమెత్తారు.

మీకు ఏ హక్కు ఉందని ఆమెపై బ్యాన్ విధించారు?

మీకు ఏ హక్కు ఉందని ఆమెపై బ్యాన్ విధించారు?

నిర్మాతల ఇష్టానుసారం నటీనటులను ఎంపిక చేస్తారు.... పలానా (శ్రీరెడ్డి) వారితో నటించవద్దని ‘మా' ఎలా చెబుతుంది? ఏ హక్కుతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఆ నిర్ణయం 24 గంటల్లోపే ఎందుకు వెనక్కి తీసుకున్నారు? అని ‘మా'ను విష్ణు నిలదీశారు.

దేశ వ్యాప్తంగా ‘మా' పరువు తీశారు

దేశ వ్యాప్తంగా ‘మా' పరువు తీశారు

నటీనటులకు చేదోడువాదోడుగా ఉండటంతో పాటు విపత్తుల సమయంలో సహాయం చేస్తున్న ‘మా'లో సంఘ ఆశయాలకు విరుద్దంగా అనేక మందికి సభ్యత్వాలు కల్పించారని విష్ణు విరుచుకుపడ్డారు. ఒక నటితో మా సభ్యులుగా ఉన్న 900 మంది నటించరాదు అని తీసుకున్న నిర్ణయం ఆమోదయోగ్యం కాదని, ఆమెపై బ్యాన్ విధించి.... 24 గంటలు గడవక ముందు వెనక్కి తీసుకోవడం ద్వారా.... దేశ వ్యాప్తంగా ‘మా' పరువు తీశారని మంచు విష్ణు ఫైర్ అయ్యారు.

మా ఫ్యామిలీ కూడా ఉంది....ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారు?

మా ఫ్యామిలీ కూడా ఉంది....ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారు?

900 మంది సభ్యుల్లో మా నాన్న గారు, నా తమ్ముడు, నా సోదరి మరియు నేను కూడా ఉన్నాం. అంటే మమల్ని కూడా కలిపే చెప్పారా? ఎవరిని అడిగి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? వెంటనే మీటింగ్‌ పెట్టి ఆ నిషేధం ఎందుకు ఎత్తేశారు. మీ చేష్టలతో ప్రజల్లో, మీడియాలో ‘మా' చులకన అయిపోతోంది... అని విష్ణు ఫైర్ అయ్యారు.

మార్గదర్శకాలు ఉండాలి

మార్గదర్శకాలు ఉండాలి

‘మా'లో సభ్యత్వం కోసం సరైన మార్గదర్శకాలు లేవు. తక్షణమే మార్గదర్శకాలను ఏర్పాటు చేయాలని ఆయన తన లేఖలో డిమాండ్‌ చేశారు. సినీ పరిశ్రమకు చెందిన 24 క్రాఫ్ట్‌లకు కూడా ఇలాంటి మార్గదర్శకాలు ఉండాలన్నారు.

కాస్టింగ్ కౌచ్ మీద కమిటీ వేయండి

కాస్టింగ్ కౌచ్ మీద కమిటీ వేయండి

కాస్టింగ్‌ కౌచ్‌ ఆరోపణలు టాలీవుడ్‌ పరువు తీసేస్తోందని, వెంటనే అత్యవసర సెల్‌ ఏర్పాటు చేయాలని, ‘మా'తో పాటు ఇండస్ట్రీలో పలు సంఘాలతో కలిపి కమిటీ వేయాలని మంచు విష్ణు ఈ సందర్భంగా తన లేఖలో కోరారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X