»   » మంచు విష్ణు, రాజ్ తరుణ్ ‘ఈడో రకం...ఆడో రకం’(ఫస్ట్ లుక్)

మంచు విష్ణు, రాజ్ తరుణ్ ‘ఈడో రకం...ఆడో రకం’(ఫస్ట్ లుక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మంచు విష్ణు, సోనారిక, రాజ్‌తరుణ్‌, హెబ్బా పటేల్‌ నటీనటులుగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రొడక్షన్‌ నం:5 గా ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. విష్ణుకి 'దేనికైనా రెడీ' వంటి సూపర్‌హిట్‌ ఇచ్చిన జి.నాగేశ్వరరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి 'ఈడో రకం...ఆడో రకం' అనే టైటిల్ ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు.

Manchu Vishnu - Raj Tarun's 'Eedo Rakam Aado Rakam'

నిర్మాత మాట్లాడుతూ ''నాగేశ్వరరెడ్డి మార్క్‌ కామెడీతో ఆద్యంతం వినోదాన్ని పంచే చిత్రమిది. ఏకధాటిగా చిత్రీకరణ చేస్తున్నాం. ఏప్రిల్‌ 14న సినిమాను విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని నిర్మాత తెలిపారు. రాజేంద్రప్రసాద్‌, పోసాని, రఘుబాబు, వెన్నెల కిషోర్‌, పృథ్వీ, సుప్రీత్‌, శత్రు, ధనరాజ్‌, ఫిష్‌ వెంకట్‌, సత్యకృష్ణ, హేమ, గీతాసింగ్‌ తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి కథ: నరేష్‌ కథూరియా, స్మీప్‌ కాంగ్‌, మాటలు: డైమంట్‌ రత్నబాబు, సంగీతం: సాయికార్తీక్‌, సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ రామస్వామి, ఎడిటర్‌: ఎమ్‌.ఆర్‌ వర్మ, ఆర్ట్‌: నాగేంద్ర, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: గరికపాటి కిషోర్‌, మేకప్‌: రంగా, కాస్టూమ్స్‌: శివ-ఖాదర్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: రాంబాబు, ఛీఫ్‌ కో డైరెక్టర్‌: గోపి.

English summary
Manchu Vishnu and Raj Tarun have teamed up for a film, directed by G.Nageswara Reddy of 'Dhenikaina Ready' fame. This film is titled "Eedo Rakam Aado Rakam" and the first look poster has been released.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu