»   » ‘గరుడ’ రాజమౌళి కాదు, మంచు విష్ణు దక్కించుకున్నాడు!

‘గరుడ’ రాజమౌళి కాదు, మంచు విష్ణు దక్కించుకున్నాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకుడు రాజమౌళి రూ. 250 కోట్ల బడ్జెట్లో ‘బాహుబలి' మూవీని రెండు భాగాలుగా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ తొలి భాగం విడుదల చేసి బాక్సాఫీసు కలెక్షన్లు రూ. 650 కోట్ల వరకు సాధించారు. రెండో భాగం కూడా విడుదలైన తర్వాత అన్నీ కలిపితే ఓవరాల్ పదమూడు వందల కోట్లకుపైగా వసూళ్లు వస్తాయని అంచనా.

కాగా... బాహుబలి తర్వాత రాజమౌళి 'గరుడ' అనే టైటిల్‌తో సినిమా తీయబోతున్నాడని ఆ మధ్య ప్రచారం జరిగింది. దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రాజమౌళిని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ‘గరుడ' టైటిల్‌ను హీరో మంచు విష్ణు ఫిల్మ్ ఛాంబర్‌లో రిజిస్టర్ చేశాడు.

Manchu vishnu Registered Garuda Title

విష్ణు తన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై ‘గరుడ' పేరుని నమోదు చేయించాడు. ఇప్పటి దాకా 'గరుడ' గురించి రాజమౌళి ఏ నాడూ స్పందించలేదు. తాజాగా మంచు విష్ణు 'గరుడ' టైటిల్ రిజిస్టర్ చేయించడంతో.... రాజమౌళి దర్శకత్వంలో ‘గరుడ' తెరకెక్కడం లేదని తేలిపోయింది.

ఇప్పటి వరకైతే మంచు విష్ణు కొత్త సినిమాలేవీ కమిట్ కాలేదు.‘గరుడ' టైటిల్ రిజిస్టర్ చేయించిన మంచు విష్ణు ఈ సినిమాలో తానే నటిస్తాడో? లేక మరెవరినైనా హీరోగా పెట్టి సినిమా నిర్మిస్తాడా? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

English summary
‘Garuda’ title is now registered by Manchu Vishnu on 24 Frames Factory banner. As per sources, the actor doesn’t have any new film that could have ‘Garuda’ title, then why he registered.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu