twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Manchu Vishnu: నా వెనుక జగన్ కాదు ఉంది వాళ్ళే.. పవన్ మాటలకు ఏకీభవించను.. నాన్నే సమాధానం ఇస్తారు!

    |

    గత కొద్దిరోజులుగా చర్చనీయాంశంగా మారిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వ్యవహారం తారాస్థాయికి చేరుతోంది. ఇప్పటికే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజు ప్యానల్ అలాగే మంచు విష్ణు ప్యానల్ ఒకరిమీద ఒకరు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ప్రకాష్ రాజు ప్యానల్ నామినేషన్లు దాఖలు చేయగా ఈ రోజు మంచు విష్ణు కూడా తన ప్యానల్ చేత నామినేషన్ దాఖలు చేయించారు. నామినేషన్ అనంతరం మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే

    ఆసక్తికరంగా ఎన్నికలు

    ఆసక్తికరంగా ఎన్నికలు

    ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు సంచలనంగా మారుతున్నాయి. ఈ సారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల బరిలో ఒక పక్క ప్రకాష్ రాజ్ తో పాటు మరో పక్క మంచు విష్ణు కూడా బరిలోకి దిగితూ ఉండడంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. అక్టోబర్ 10వ తేదీన జరగబోతున్న ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది.

    నిన్న ప్రకాష్ రాజ్ తో పాటు ఆయన ప్యానెల్ సభ్యులు కూడా నామినేషన్ దాఖలు చేయగా వారి తరువాత సీవీఎల్ నరసింహారావు కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఇక తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్న బండ్ల గణేష్ కూడా నామినేషన్లు దాఖలు చేశారు.

    మా వెనుక జగన్

    మా వెనుక జగన్

    ఇక ఈ రోజు తన ఇంటి నుంచి ఫిలిం ఛాంబర్ వరకు భారీ ర్యాలీతో వెళ్లిన మంచు విష్ణు దాసరి నారాయణ రావు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి ఆ తర్వాత ఆయన నామినేషన్ దాఖలు చేశారు. మంచు విష్ణు నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఆయన ప్యానల్ సభ్యులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. ఇక నామినేషన్లు దాఖలు చేసిన అనంతరం మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు.

    ఇక ఈ మా ఎన్నికల్లో మేమే గెలుస్తామని ఈ విషయంలో పూర్తి విశ్వాసంతో ఉన్నామని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. ఇది తెలుగు నటులు ఆత్మగౌరవ పోరాటం అని పేర్కొన్న విష్ణు మా వెనుక జగన్ గారు ఉన్నారని మీడియాలో ప్రచారం జరుగుతోందని నిజానికి తమ వెనుక ఉన్న జగన్ కాదని తొమ్మిది వందల మంది మా సభ్యుల మద్దతు ఉందని ఆయన అన్నారు.

    చిరంజీవి, పవన్ కళ్యాణ్ కూడా ఓట్లు నాకే

    చిరంజీవి, పవన్ కళ్యాణ్ కూడా ఓట్లు నాకే

    ఇక నేను పెట్టిన మేనిఫెస్టో చూస్తే చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లు కూడా తనకు ఓట్లు వేస్తారని విష్ణు ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్ల గురించి మాట్లాడేందుకు మంచు విష్ణు నిరాకరించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు గురించి మా నాన్న మంచు మోహన్ బాబు గారు మాట్లాడతారని విష్ణు పేర్కొన్నారు.

    ఆయన ఏమంటారు?

    ఆయన ఏమంటారు?

    అయితే పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడిన మాటలు గురించి తాను ఏకీభవించడం లేదని పేర్కొన్న మంచు విష్ణు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు మద్దతిస్తున్నానని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్నాను కాబట్టి ఫిలిం ఛాంబర్ తీసుకున్న స్టాండ్ కు కట్టుబడి ఉంటామని ఆయన అన్నారు. ఇదే విషయంలో ప్రకాష్ రాజ్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటారో అనేది చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు..

    Recommended Video

    NTR Buys Fancy Number For 17 Lakhs | Lamborghini Urus || Filmibeat Telugu
    ప్యానల్ ఇదే

    ప్యానల్ ఇదే

    ఇక మంచు విష్ణు కొద్దిరోజుల క్రితం తన ప్యానల్ ను పూర్తిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్యానల్ నుంచి అధ్యక్షుడిగా మంచు విష్ణు బరిలోకి దిగుతుండగా ఉపాధ్యక్షులుగా మాదాల రవి, పృథ్వీరాజ్ లు, జనరల్ సెక్రటరీగా రఘుబాబు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా బాబు మోహన్, ట్రెజరర్ గా శివ బాలాజీ, జాయింట్ సెక్రటరీలుగా కరాటే కల్యాణి, గౌతమ్‌ రాజు బరిలోకి దిగుతున్నారు.

    ఇక ఎక్సి క్యూటివ్ సభ్యులుగా అర్చన, అశోక్‌ కుమార్‌, గీతా సింగ్‌, హరినాథ్‌ బాబు, జయ వాణి, మలక్‌ పేట్‌ శైలజ, మాణిక్‌, పూజిత, రాజేశ్వరీ రెడ్డి, సంపూర్ణేశ్‌ బాబు, శశాంక్‌, శివన్నారాయణ, శ్రీలక్ష్మి, శ్రీనివాసులు.పి, స్వప్న మాధురి, విష్ణు బొప్పన, వడ్లపట్ల.ఎమ్‌.ఆర్‌.సి, రేఖ వంటి వారు పోటీ చేస్తున్నారు.

    English summary
    Manchu vishnu responds on pawan kalyan comments in republic event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X