Manchu Vishnu: ఐలవ్యూ ప్రకాష్ రాజ్ గారు.. అంటూ వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ షేర్ చేసిన విష్ణు!

గత రెండు మూడు నెలలుగా తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు తుది అంకానికి చేరుకున్న సంగతి తెలిసిందే ఇప్పటికే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికకాగా కొన్ని ఆఫీసు బేరర్ పదవులు అలాగే ఈ నెంబర్ కి సంబంధించిన పూర్తి జాబితా ఈ రోజు సాయంత్రానికి వెల్లడయ్యే అవకాశం ఉంది.. అయితే మావయ్య ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్షిప్ లకు రాజీనామాల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో మంచు విష్ణు చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

ఆత్మగౌరవంతో

ఆత్మగౌరవంతో

అక్టోబర్ 10వ తేదీన జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో ప్రకాష్ రాజ్ అలాగే మంచు విష్ణు పోటీపడగా మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే ఇక్కడ ఎక్కువగా ప్రాంతీయ వేదమే కనిపించిందని తనను అతిథిగా మాత్రమే ఉండమని కొంత మంది మాట్లాడారు కాబట్టి వారి మాటలకు ఏకీభవిస్తూ ఇకమీదట అతిథిగా మాత్రమే ఉండబోతుందని ప్రకాష్ రాజు ప్రకటించారు. తాను ఓడిపోయానని ఈ నిర్ణయం తీసుకోవడం లేదని ఆత్మగౌరవంతో మాత్రమే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు.

మంచు విష్ణు స్పందన

మంచు విష్ణు స్పందన

21 ఏళ్ల క్రితం తాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వం తీసుకున్నారని ఈ రోజు నుంచి తాను సభ్యుడిని కాదని రాజీనామా చేస్తున్నానని ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు.. ఇక ఇదే విషయం మీద నాగబాబు కూడా ఫలితాలు ప్రకటన వెలువడిన వెంటనే తాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక తాజాగా ప్రకాష్ రాజ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం మీద మంచు విష్ణు స్పందించారు.

 మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి

మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి

అయితే ప్రకాష్ రాజ్ తాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మీడియా ముఖంగా ప్రకటించడమే కాక ఇదే విషయాన్ని నూతనంగా మా అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు దృష్టికి వాట్సాప్ మెసేజ్ ద్వారా తీసుకువెళ్లారు. ఆ మెసేజ్ స్క్రీన్ షాట్ ను విష్ణు ఇప్పుడు తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. భవిష్యత్తు కోసం. మేమంతా ఒక్కటే. ఎల్లప్పుడూ....అంటూ స్క్రీన్ షాట్ ను పోస్ట్ చేసిన మంచు విష్ణు సక్సెస్ లు ఫెయిల్యూర్ లు సహజమని, మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండని కోరారు. మీరు 'మా' కుటుంబంలో మెంబర్ అని, మీ సలహాలు సూచనలు 'మా'కు అవసరం అని అన్నారు.

 నాన్ మెంబర్గా మీకు సపోర్ట్ చేస్తా

నాన్ మెంబర్గా మీకు సపోర్ట్ చేస్తా

స్క్రీన్ షాట్ లో ఉన్న దాని ప్రకారం ముందుగా ప్రకాష్ రాజ్ మంచు విష్ణు విజయానికి శుభాకాంక్షలు తెలుపుతూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. అయితే తాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్షిప్ కి రాజీనామా చేయాలని భావిస్తున్నానని అని నా నిర్ణయాన్ని దయచేసి ఒప్పుకోవాలని కోరారు. నాన్ మెంబర్గా ఎల్లప్పుడూ మీకు సపోర్ట్ చేస్తానని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.

మీతో కలిసి పని చేయడం చాలా అవసరం


దానికి మంచు విష్ణు స్పందిస్తూ మీ నిర్ణయం తో నేను ఏకీభవించడం లేదు, మీరు నాకన్నా చాలా పెద్ద వాళ్ళని నాకు మీ ఐడియాలు మీతో కలిసి పని చేయడం చాలా అవసరం అని చెప్పుకొచ్చారు. మీరు ఎమోషనల్ గా ఉన్నారు కాబట్టి నేను పెట్టిన మెసేజ్ కి మీరు ఇప్పుడే రిప్లై ఇవ్వవద్దని కోరారు. ఇక నేను త్వరలోనే మిమ్మల్ని కలిసి డిస్కస్ చేస్తానని చెబుతూ ఐ లవ్యూ అంకుల్ అని మెసేజ్ లో పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X