For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంపూర్ణేష్ బాబు ‘సింగం 123’ ..పూర్తి డిడేల్స్

    By Srikanya
    |

    హైదరాబాద్ : హృదయ కాలేయం చిత్రంతో పరిచయమైన సంపూర్ణేష్‌బాబు హీరో గా మరో సినిమా కమిటయ్యారయిన సంగతి తెలిసిందే. సింగం 123 టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని మంచు విష్ణు తమ 24 ఫ్రేమ్స్ పతాకంపై నిర్మించనున్నారు. తమిళ హిట్ సింగం కి స్పూఫ్ లా ఉంటుందని వినికిడి. ఈ చిత్రం విషయమై మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు.

    మంచు విష్ణు మాట్లాడుతూ... ‘సింగం 123' నాకు చాలా ప్రతిష్ఠాత్మక చిత్రం. ఫేవరేట్‌ ప్రాజెక్ట్‌. నా మెయిన్‌ కాన్‌సన్‌ట్రేషన్‌ దానిమీదే. అక్షిత్‌శర్మ అనే ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ విద్యార్థి దాన్ని డైరెక్ట్‌ చేయబోతున్నాడు. త్వరలోనే దాన్ని ప్రారంభించబోతున్నాం. జేమ్స్‌బాండ్‌, హాట్‌ షాట్స్‌, ట్రూ లైస్‌ సినిమాల తరహాలో యాక్షన్‌ కామెడీ ఫిల్మ్‌. వెరీ వెరీ గ్లామరస్‌ ఫిల్మ్‌ అన్నారు మంచు విష్ణు.

    Manchu Vishnu reveals about Singam-3 Details

    ప్రస్తుతం సంపూర్ణేష్ బాబు...కొబ్బరి మట్ట అనే చిత్రం చేస్తూ బిజీగా ఉన్నాడు. అలాగే...సంపూర్ణేష్ బాబు హీరోగా... వైరస్ డాట్ కామ్ అనే పేరుతో ఓ వినూత్న చిత్రం తెరకెక్కుతోంది. (బి వేర్) అనేది ఉపశీర్షికతో వస్తున్న ఈ చిత్రానికి సీ.హెచ్. శివరామకృష్ణ దర్శకత్వం వహించనున్నారు. విజయదశమి రోజున లాంఛనంగా ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని ఎ.ఎస్.ఎన్ ఫిల్మ్స్ పతాకంపై సలీం, ఎ.జె. రాంబాబు సంయుక్తంగా నిర్మించనున్నారు. దర్శకుడు మాట్లాడుతూ సంపూర్ణేష్‌బాబు నుంచి ప్రేక్షకులు ఏ తరహా వినోదాన్ని కోరుకుంటున్నారో అది ఈ సినిమాలో వంద శాతం వుంటుంది.

    కథకు తగ్గ హీరో కుదిరారు. ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కించనున్నాం అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ నేటి వాస్తవ పరిస్థితులని ప్రతిభింబిస్తూ..నేటి యువతరాన్ని ఉత్తేజపరుస్తూ ఆద్యంతం వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించాలని సన్నాహాలు చేస్తున్నాం. అక్టోబర్, నవంబర్ నెలల్లో చిత్రీకరణ పూర్తి చేసి చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.

    English summary
    Sampoornesh Babu's Singam 123 directed by new comer Akshith Sharma..produced by Manchu Vishnu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X