అమ్మాయిలే టార్గెట్: మంచు విష్ణు-వర్మ మూవీ టైటిల్ ఇదే!

By Bojja Kumar

హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. తాజాగా ఈ చిత్రానికి టైటిల్ ఫైనల్ అయింది. 'అనుక్షణం' అనే టైటిల్ ని ఖరారు చేసారు. 'అమ్మాయిలూ జాగ్రత్త' అనేది ఈ సినిమాకి ఉపశీర్షిక.

సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మంచు విష్ణు సరసన తేజస్వి నటిస్తుండగా, మధు శాలిని ఓ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది. గతంలో విష్ణు, వర్మ కాంబినేషన్లో 'రౌడీ' సినిమా వచ్చింది. ఆ సినిమాలో విష్ణు నటనకి మంచి మార్కులు పడ్డాయి.

సినిమాని ఎంత చవకగా తీయొచ్చో 'ఐస్‌క్రీమ్‌'తో చూపి, వివాదం లేపి మరీ డబ్బులు చేసుకున్నారు రామ్‌గోపాల్‌ వర్మ. సహకార సంఘం సూత్రాన్ని అన్వయించి ఆ సినిమా హిట్ కొట్టానంటున్న ఆయన ఇప్పుడు పంపిణీ విధానంలోనూ మార్పులు తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టారు. సినిమాని థియేటర్ల వారీగా వేలం పెట్టి పంపిణీ చేయనున్నారు. 'అనుక్షణం' సినిమాతోనే ఈ పద్ధతికి శ్రీకారం చుట్టబోతున్నారు వర్మ.

Manchu Vishnu, RGV new movie title Anukshanam

వర్మ మాట్లాడుతూ ''సినిమా వ్యాపారంలో ఎక్కువ మందిని భాగస్వాములను చేయాలనుకొంటున్నాం. ఇదివరకు సినిమాని బయ్యర్లకు అమ్మేవాళ్లం. ఇక నుంచి ప్రత్యేకంగా బయ్యర్లు అంటూ ఉండరు. ఎవ్వరైనా సినిమాని కొనుక్కోవచ్చు. filmauction.in పేరుతో వెబ్‌సైట్‌ని ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌లో వేలంపాట నిర్వహిస్తాం. థియేటర్‌ స్థాయిని బట్టి కనీస ధరావతుని నిర్ణయిస్తాం. ఆపైన ఎవరు ఎక్కువకు కొంటే వాళ్లకు ప్రదర్శన హక్కులు ఇస్తాం. వసూళ్ల ద్వారా వచ్చిన ప్రతి పైసా సినిమాని కొన్న వ్యక్తి ఖాతాలో పడిపోతుంది అన్నారు.

అలాగే... ఏ షోకి ఎంత డబ్బు వసూలైందన్న విషయాల్ని కూడా ఎప్పుటికప్పుడు ఆన్‌లైన్‌లో ప్రకటిస్తాం. ఏ వ్యాపారంలోనైనా రిస్క్‌ ఉంటుంది. సినిమాల్లోనూ అంతే. 90 శాతం సినిమాలు నష్టపోతున్నాయంటే అవగాహన లేకపోవడమే కారణం. పంపిణీ వ్యవస్థ లేకుండా సినిమాని ప్రేక్షకుల దగ్గరికి చేర్చడం ఎలా అన్న ఆలోచనలో భాగంగానే ఈ ప్రయత్నం. అలాగని పంపిణీదారుల్ని దూరం పెట్టడం మా ఉద్దేశం కాదు. వాళ్లూ సినిమాని వేలం పాటలో కొనుక్కోవచ్చు'' అన్నారు.

మంచు విష్ణు మాట్లాడుతూ.... ''ఇది రామ్‌గోపాల్‌ వర్మ ఆలోచన. చట్టానికి లోబడి న్యాయనిపుణుల సలహా మేరకు ఈ పద్ధతిని అనుసరిస్తున్నాం. ఈ వెబ్‌సైట్‌ ద్వారా ఎవరైనా తమ సినిమాని అమ్ముకోవచ్చు. వేలం పాటలో పాల్గొనదలిచినవారు కనీస ధరావత్తును ముందుగా చెల్లించాల్సి వుంటుంది. వేలం పాటలో సినిమా దక్కించుకోనివారికి డబ్బులు వాపస్‌ ఇస్తాం'' అన్నారు విష్ణు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X