'బ్రహ్మీ బ్యాక్ ఎగైన్': మంచు విష్ణు 'ఆచారి అమెరికా యాత్ర' ట్రైలర్..(వీడియో)
Recommended Video

హీరో మంచు విష్ణు, కామెడీ కింగ్ బ్రహ్మానందం కాంబినేషన్ సిల్వర్ స్కీన్‌పై ఎంతగా హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో రాబోతున్న 'ఆచారి అమెరికా యాత్ర'పై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. దర్శకుడు నాగేశ్వరరెడ్డి మంచు విష్ణుకు గతంలో 'దేనికైనా రెడీ' వంటి మంచి హిట్ ఇవ్వడంతో.. మరోసారి ఈ కాంబినేషన్ హిట్ అందుకుంటుందా? అన్నది ఆసక్తిగా మారింది. తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది.

గురు శిష్యులుగా..:
పౌరోహిత్యం చేసే గురు శిష్యులుగా ఈ ట్రైలర్‌లో బ్రహ్మానందం,విష్ణు కనిపిస్తున్నారు. అమెరికాలో స్థిరపడ్డ ఓ తెలుగు కుటుంబం ఆహ్వానం మేరకు.. వాళ్లింట్లో హోమం చేయడానికి ఈ ఇద్దరు అక్కడికి వెళ్తారని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

అమెరికాలో ఎదురయ్యే సంఘటనలతో..:
తీరా అమెరికా వెళ్లాక.. విష్ణు ఓ అమ్మాయితో ప్రేమలో పడటం.. హోమం చేయడానికి కొన్ని ఆటంకాలు ఎదురుకావడం.. ఇంతలోనే విలన్ ఎంట్రీ.. మొత్తంగా 'ఆచారి అమెరికా యాత్ర' వీటి చుట్టే తిరుగుతుందని ట్రైలర్‌ను బట్టి చెప్పవచ్చు.

బ్రహ్మి బ్యాక్ ఎగైన్..
యాక్షన్, కామెడీ మేళవింపుతో కాస్త లవ్ స్టోరీ టచ్ ఇస్తూ దర్శకుడు కథ నడిపించినట్లుగా అనిపిస్తోంది. సినిమా ప్రారంభం నుంచి క్లైమాక్స్ వరకు ఆద్యంతం కామెడీతో నింపేసి ఉంటాడని పక్కాగా అర్థమవుతోంది. ఇక గత కొంతకాలంగా బ్రహ్మానందం నుంచి ఆశించిన మేర కామెడీ రావట్లేదన్న విమర్శలకు 'బ్రహ్మీ బ్యాక్ ఎగైన్' అనేలా ఈ చిత్రం ఉంటుందని టాక్.

బ్రహ్మానందం-విష్ణు కామెడీ ట్రాక్..:
సినిమా అంతా ప్రధానంగా బ్రహ్మానందం-విష్ణు కామెడీ పైనే ఆధారపడి నడుస్తుందని అర్థమవుతోంది. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన ఢీ, దేనికైనా రెడీ సినిమాలు మంచి హిట్స్ సాధించడంతో విష్ణు ఈ సినిమాపై నమ్మకంగా ఉన్నాడు. సినిమాలో వీరిద్దరి కామెడీ ట్రాక్ ఎంతగా వర్కౌట్ అవుతుందనే దానిపైనే సినిమా ఫలితం ఆధారపడి ఉంది. ఇక థమన్ అందించిన మ్యూజిక్ కూడా ఆకట్టుకునే లాగే ఉంది.

రిలీజ్ డేట్:
ఆచారి అమెరికా యాత్ర చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. విష్ణు సరసన ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాసరావు, పోసాని, పృథ్వి, ప్రవీణ్, విద్యుల్లేఖ, రామన్, ప్రభాస్ శ్రీను, ప్రదీప్ రావా, ఠాకూర్ అనూప్‌సింగ్, సురేఖవాణి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
టెక్నికల్ డిటైల్స్:
ఈ చిత్రానికి రచన: మల్లాది వెంకటకృష్ణమూర్తి, మాటలు: డార్లింగ్ స్వామి, ఛాయాగ్రహణం: సిద్ధార్థ్, సంగీతం: ఎస్.ఎస్.థమన్, ఎడిటింగ్: వర్మ, యాక్షన్: కనల్‌కణ్ణన్, ఆర్ట్: కిరణ్, సమర్పణ: ఎం.ఎల్.కుమార్‌చౌదరి, నిర్మాతలు: కీర్తిచౌదరి, కిట్టు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.నాగేశ్వర్‌రెడ్డి.


Click it and Unblock the Notifications











