For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మంచు విష్ణు ఓ రేంజిలో పేలాడు (వీడియో)

By Srikanya
|

హైదరాబాద్ :మంచు విష్ణు హీరోగా దేవా కట్టా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం డైనమేట్. మోహన్‌బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ పతాకంపై మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రణీత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమిళ చిత్రం అరిమనంబి ఆధారం. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆడియో విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రం టీజర్ ని విడుదల చేసారు. ఈ ట్రైలర్ ఓ రేంజిలో పేలింది. సిని అభిమానులను ఆకట్టుకుంటున్న ఈ చిత్రం టీజర్ ని ఇక్కడ చూడండి.

మంచు విష్ణు మాట్లాడుతూ .....డైనమేట్ లాంటి ఓ యువకుడి కథతో తెరకెక్కుతున్న చిత్రమిది. కథకు తగ్గ టైటిల్ కుదిరింది. కథ డిమాండ్ మేరకు కొత్త లుక్ కోసం పాత్ర పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇందులో నా పై చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు కొత్తగా వుంటాయి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని త్వరలో ... ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నాంఅన్నారు.

మంచు విష్ణు హీరోగా డిఫరెంట్ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. 2014లో పాండవులు పాండవులు తుమ్మెద, రౌడీ, అనుక్షణం, ఎర్రబస్సు చిత్రాల్లో నటించిన ఈ డైనమిక్ హీరో ప్రతి సినిమాలోనూ డిఫరెంట్ లుక్, స్టయిల్‌తో ఆకట్టుకున్నారు.ప్రస్తుతం దేవా కట్టా దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం తమిళంలో మంచి విజయాన్ని సాధించిన ‘అరిమ నంబి' చిత్రానికి రీమేక్‌గా రూపొందుతోంది.

ఆ మధ్యన ఈ సినిమాకి సంబంధించి హీరో విష్ణు లుక్ చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ లుక్ కి అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. అలాగే ఈ సినిమాలో విష్ణు డిఫరెంట్ గా చెవిపోగులతో కనిపించనున్నాడు. హీరో కొత్త లుక్ లో కనబడితే బావుంటుందని భావించిన డైరెక్టర్ దేవాకట్టా తన ఆలోచనని విష్ణుకి తెలియజేయడం, సినిమాల్లో తన పాత్ర, లుక్ పరంగా భిన్నంగా కనబడాలనుకునే హీరో మంచు విష్ణు దానికి సరేననడం జరిగింది.

Manchu Vishnu's Dynamite Teaser

విష్ణు పోషిస్తున్న పాత్ర, ఆయన అభినయం, ఆహార్యానికి తగినట్లుగానే ‘డైనమైట్‌' టైటిల్‌ను నిర్ణయించినట్లు దేవా కట్టా చెప్పారు. ‘‘చెవిపోగు, చేతి పొడవునా టాటూతో డిఫరెంట్‌ లుక్‌తో విష్ణు కనువిందు చేయనున్నారు. ఇందులో యాక్షన్‌ సన్నివేశాల కోసం ఆయన స్పెషల్‌ ట్రైనింగ్‌ కూడా తీసుకున్నారు. ప్రేక్షకులు, అభిమానులను అలరించే విధంగా ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తున్నాం'' అని తెలిపారు.

English summary
Teaser of Manchu Vishnu's forthcoming action drama Dynamite released recently and it won appreciation from audiences. Now makers have released another teaser of the film. This film is actually a remake of Tamil action thriller Arima Nambi.Directed by Deva Katta.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more