సొట్టబుగ్గలతో ముద్దొస్తున్నాడు: మంచు విష్ణు కొడుకు ‘అవ్రామ్ భక్త’ ఫస్ట్ లుక్
2018 కొత్త సంవత్సరం మొదలైన రోజే సినీ నటుడు మంచు విష్ణు వారసుడు వచ్చిన విషయం తెలిసిందే. కొత్త ఏడాదిలో తమ ఇంటికి కొత్త శోభను తెచ్చిన వారసుడంటూ మంచు ఫ్యామిలీ మురిసిపోయింది. తాజాగా మంచు విష్ణు తన కుమారుడి ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు.

విష్ణు కుమారుడు ‘అవ్రామ్ భక్త మంచు’
తన కుమారుడి ఫోటోను మంచు విష్ణు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ ఫోటో చూసిన అభిమానులు అచ్చం తండ్రి పోలికలతో సొట్టబుగ్గలేసుకుని ఎంతో ముద్దుస్తున్నాడని అంటున్నారు.

అవ్రామ్ భక్త అంటే ఏమిటి?
విష్ణు కుమారుడికి ఆసక్తికరమైన పేరును పెట్టేసింది మంచు ఫ్యామిలీ. ‘అవ్రామ్ భక్త' అని పేరు పెట్టామంటూనే దాని అర్ధాన్ని కూడా చెప్పుకొచ్చారు విష్ణు. "అవ్రామ్ అంటే ఎవరు ఆపలేరని" అర్ధమట.

మంచు విష్ణు ఫ్యామిలీ
ఇదివరకే మంచు విష్ణు, విరోనికా రెడ్డి దంపతులకు డిసెంబర్ 2011లో కవలలు జన్మించారు. అయితే వీరిలో అరియానా తమ తమ్ముడిని `బేబీ లయన్`అని, వివియానా `బేబీ టెడ్డీ బేర్` అని పిలుస్తున్నట్టు కూడా సోషల్ మీడియాలో పేర్కొన్న విష్ణు తాము మూత్రం ‘అవ్రామ్ భక్త' అని పిలుస్తున్నట్టు తెలిపారు.

విష్ణు సినిమాలు
ప్రస్తుతం మంచు విష్ణు ‘ఆచారి అమెరికా యాత్ర' చిత్రం చేస్తున్నారు. జి నాగేశ్వర్ రెడ్డి దర్వకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











