చిత్రాన్ని మధ్యలోనే ఆపేయకుండా పెద్దతప్పే చేశాను...మంచు విష్ణు
ఆ చిత్రాన్ని మధ్యలోనే ఆపేయకుండా ఒకరకంగా పెద్దతప్పే చేశాను. దాని వల్ల 13 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. సినిమా మధ్యలో ఆపేస్తే రెండు కోట్ల రూపాయలు పోయేవి. ఈ విషయంలో నాన్నకు బాధ కలిగించా. 'సలీమ్' పరాజయం చాలా నేర్పింది. ముఖ్యంగా ఓ సినిమా నిర్మాణం ఎలా ఉండకూడదో తెలుసుకున్నా అంటూ బాధగా స్పందించారు మంచు విష్ణు. ఆయన తాజా చిత్రం వస్తాడు నా రాజు ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన ప్రతీ చోట 'సలీమ్' చిత్ర ప్రస్తావన తెస్తున్నారు.
అందుకే తాను మంచి స్క్రిప్ట్ కోసమే ఇన్నాళ్లూ ఆగాల్సి వచ్చిందని అన్నారు. అయితే టాలీవుడ్‌లో హిట్..ప్లాప్ లను ముందే చెప్పలేమని, సినిమా తీసే ముందే స్పష్టత ఉండాలని ఆయన వివరించారు. ఇక తన కొత్త చిత్రం దర్శకుడు గురించి చెబుతూ..హేమంత్ మధుకర్ మంచి దర్శకుడు. ఆయనతో పనిచేయటం చాలా సౌకర్యంగా ఉంది. తన చిత్రాన్ని చాలాబాగా తీర్చిదిద్దారు. ఒక కొత్తదర్శకుడితో పనిచేస్తున్నానన్న భావన కలగలేదు. ప్రతీ విషయంలోనూ పక్కా ప్రణాళికతో పనిచేశాడు. తనకు, నాకూ సరికొత్త ప్రయత్నం. తప్పకుండా మంచి పేరొస్తుంది అని వివరించారు.


Click it and Unblock the Notifications











