తాప్సీ తాజా చిత్రం 'వస్తాడు నా రాజు' రిలీజ్ ఎప్పుడంటే...
వరస ఫ్లాఫ్ లతో దూసుకుపోతున్న మంచు విష్ణు వర్ధన్ తాజా చిత్రం 'వస్తాడు నా రాజు' ఫిబ్రవరి నాలుగవ తేదీన విడుదకానుంది. హేమంత్ మధుకర్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రం ద్వారా పరిచయం కానున్నాడు. తాప్సీ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో విష్ణు స్టోర్ట్స్ మెన్ గా కనిపిస్తాడు. క్రీడాకారుడికీ, ఓ అందాల భామకీ మధ్య సాగే సరదా ప్రేమాయణమే ఈ చిత్ర కథ. ప్రతి సన్నివేశం వినోదభరితంగా ఉంటుందని దర్శకుడు హేమంత్ మధుకర్ 'వస్తాడు నా రాజు' చెప్తున్నారు. అలాగే ప్రతీ అమ్మాయికీ తనకెలాంటి కలల రాకుమారుడు వస్తాడో అని కలలు ఉంటాయి. తాను కోరుకున్న కలలరాకుమారుడు ఒక అమ్మాయి జీవితంలో తారసపడితే అనే పాయింట్ చుట్టూతిరుగుతుందని అంటున్నారు. అలాగే దర్శకుడు ఈ చిత్రంలో ప్రేక్షకుల ఊహకు అందని నావెల్ ఉందని చెప్తున్నారు. ఇక తాప్సీది బబ్లీగా ఉండే పాత్ర. సమర్పణ: మోహన్‌బాబు, నిర్మాణం: 24 ఫ్రేమ్స్.
తాప్సీ వస్తాడు నా రాజు ఝుమ్మంది నాదం మంచు మనోజ్ రాఘవేంద్ర రావు tapsi vastadu naa raju jhummandi naadam manchu manoj raghavendra rao


Click it and Unblock the Notifications