twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇలాగైతే మా ఆస్తులు అమ్మేసుకోవాలి.. చంద్రబాబుపై మంచు విష్ణు అటాక్!

    |

    సీనియర్ నటుడు మోహన్ బాబు సినిమాల్లో నటిస్తూనే అప్పుడప్పుడూ రాజకీయ పరమైన వ్యాఖ్యలు కూడా చేస్తుంటారు.మోహన్ బాబు తనయులు మంచు విష్ణు, మనోజ్ ఇద్దరూ సినిమాల్లో నటిస్తున్నారు. సినిమా నిర్మాణంలో కూడా మంచు ఫ్యామిలీ భాగమవుతూ ఉంటుంది. వీటితో పాటు మోహన్ బాబు శ్రీ విద్యానికేతన్ సంస్థల్ని కూడా నడిపిస్తున్నారు. ఇటీవల మోహన్ బాబు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఇంజనీరింగ్ కళాశాలల ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో నిలదీసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలకు కొనసాగింపుగా మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు రంగంలోకి దిగాడు.

    ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు

    ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు

    ఇటీవల మోహన్ బాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ గురించి ఎంత మొరపెట్టుకున్నా చంద్రబాబు స్పందించడం లేదని విమర్శించిన సంగతి తెలిసిందే. 2017-18 విద్యాసంవత్సర బకాయిలని ప్రభుత్వం ఇంతవరకు చెల్లించలేదని మోహన్ బాబు విమర్శించారు. పలుమార్లు ముఖ్యమంత్రికి ఉత్తరాలు రాసినా స్పందించలేదని అన్నారు. తాజాగా మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు కూడా ఈ విషయమై స్పందించాడు.

     కొమ్ము కాయకండి

    కొమ్ము కాయకండి

    తన తండ్రి ఇటీవల ప్రభుత్వాన్ని ఫీజు బకాయిల విషయంలో నిలదీసేందుకు మీడియా సమావేశం నిర్వహించారు. కానీ శాంతారాం ఇంజనీరింగ్ కళాశాలల అధినేత మాత్రం ప్రభుత్వానికి కొమ్ము కాశారు అని మంచు విష్ణు ఘాటుగా విమర్శించారు. రిజిస్టర్ అయిన సంస్థకు సంబంధించిన వ్యక్తి ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలకు మద్దత్తు తెలపకూడదని మంచు విష్ణు అభిప్రాయపడ్డాడు.

    ‘మంచు' వారికి ఆ జబ్బు ఉంది.. చిత్రం శ్రీను కామెంట్‌కు మంచులక్ష్మి కౌంటర్‘మంచు' వారికి ఆ జబ్బు ఉంది.. చిత్రం శ్రీను కామెంట్‌కు మంచులక్ష్మి కౌంటర్

    కక్కలేక మింగలేక

    కక్కలేక మింగలేక

    ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా కలిసిన వారికే ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలు అందుతున్నాయని మంచు విష్ణు సంచలన ఆరోపణ చేశారు. కానీ ప్రభుతం మాత్రం ఫీజు రీయింబర్స్ మెంట్ సక్రమంగా అందిస్తున్నామని ప్రకటనలు చేసుకుంటోంది. దీనిపై ఆపెక్క సంస్థ స్పందించాలని మంచు విష్ణు కోరారు. చాలా కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వ వైఖరిపై కక్కలేక.. మింగలేక సతమతమవుతున్నాయని మంచు విష్ణు తెలిపారు.

     నిజాలు తేల్చేందుకు సిద్ధం

    నిజాలు తేల్చేందుకు సిద్ధం

    పరిస్థితి ఇలాగే కొనసాగితే మా ఆస్తులు అమ్మేసుకుని ఉద్యోగులకు వేతనాలు చెలించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మోహన్ బాబు అన్నారు. ప్రభుత్వం ఫీజులు సక్రమంగా చెల్లిస్తోంది అని అపెక్క చెబుతోంది. కానీ 2017-18 విద్యాసంవత్సరానికి రూ.1,84,98,675 బకాయిలు చెల్లించాల్సి ఉందని మంచు విష్ణు అన్నారు. దీనిపై నిజాలు తేల్చేందుకు ప్రభుత్వంతో చర్చకు సిద్ధం అని మంచు విష్ణు తేల్చారు.

    English summary
    Manchu Vishnu sensational comments on AP Govt and CM Chandrababu
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X