ఆ రోజు కొట్టేంత పనిచేశారు.. నాన్నను కంట్రోల్ చేసే శక్తి తనకు మాత్రమే ఉంది.. విష్ణు కామెంట్స్ వైరల్
మంచు వారి ఫ్యామిలీలో కుటుంబ కలహాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారంటూ విభిన్న కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. అదే తరుణంలో మంచు మనోజ్ పై, అటు మోహన్ బాబుపై, కేసుల నమోదు అయినట్లు సమాచారం. ఆస్తి కోసమే వీరి మధ్య తగాదాలు వస్తున్నాయని పలువురి వాదన. అయితే.. తాజాగా నటుడు మంచు మోహన్ బాబు పై తనయుడు మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఇంతకీ ఏమన్నారంటే..
హీరో మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తండ్రి మోహన్ బాబు గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. 'మా నాన్నకు కోపం వస్తే కంట్రోల్ చేసే శక్తి తమకు లేదు. ఆయన చేత ఎన్నోసార్లు దెబ్బలు తిన్నా.. ఆయన చెయ్యి ఎప్పుడు లేస్తా అనేది.. ఇప్పటికీ మాకు భయమే, ఆయన కోపంగా ఉన్నప్పుడు ఎలా అప్రోచ్ కావాలో మాకు తెలియదని అన్నారు. ఒకవేళ మీ మీదైనా తప్పు చేస్తే.. మాకు అడల్ ఆ రోజు పనికి పోవాల్సిందే. కానీ మా నాన్నను కంట్రోల్ చేసే శక్తి మా అక్క(మంచు లక్ష్మి) కి మాత్రమే ఉందని, నాన్నతో అక్క మాత్రమే ధైర్యంగా మాట్లాడుతుందని అన్నారు.

ఏ విషయంలోనైనా తప్పు చేస్తేనే ఆయన కోప్పడతారని, ఆయన కోపంలో కూడా అర్థం ఉందని చెప్పుకొచ్చారు. అక్కకు మాత్రమే నాన్నను ఎదిరించి మాట్లాడేంత ధైర్యం ఉందని వెల్లడించారు. వాస్తవానికి మేము చేసే పనులు కూడా కొన్ని ఆయన కోపం తెప్పించాలని ఉంటాయి. అందుకే మాపై కోప్పడుతూ ఉంటాడు అని పేర్కొన్నారు.
పెళ్లయిన తర్వాత ఓసారి తనను ఎక్కడ కొడతాడోనని భయపడ్డనంటూ ఓ ఫన్నీ ఇన్సిడెంట్ ను చెప్పుకొచ్చారు మంచు విష్ణు. 'ఓసారి నా భార్యకు బయటికి తీసుకెళ్తానని మాటిచ్చాను. కానీ బిజీ షెడ్యూల్ వల్ల ఆ రోజు కాస్త అలసటగా ఉంది. నావల్ల కాదంటూ పడుకున్నా .. దీంతో నా(విన్నీ) భార్య ఏడుస్తూ రూమ్ లో బయటకు వెళ్ళింది. ఆ విషయాన్ని మా నాన్న గమనించారు. వెంటనే విన్నీ రూమ్ లోకి వచ్చి సైలెంట్ గా కూర్చుంది. మళ్లీ రూమ్ లోకి ఎందుకు వచ్చిందని ఆలోచించే లోపే నాన్న వచ్చి రూమ్ డోర్ తట్టాడు. తలుపు తీయరా అని నాన్న గట్టిగా అరిచారు. దీంతో నా ఫ్యుజులు లెగిపోయాయి' అన్నారు.
'ఎందుకు ఆ అమ్మాయి ఏడుస్తుంది. ఏమైన్నావ్ అంటూ నిలదీశాడు. నాకేం అర్థం కాలేదు ఏం జరుగుతుందో ఏం చెప్పాలో ఆలోచిస్తున్నా. . వాస్తవానికి బయటికి వెళ్దామని మాట ఇచ్చా కానీ టైం లేక పడుకున్న మన సమాధానం చెప్పు .. 'ఒక్కరోజు నిద్రపోకపోతే ఏం పర్వాలేదు, కానీ ఇంటి మహాలక్ష్మి ఏడుస్తోంది. ఆ విషయంలో కాస్త భయపడ్డా' అని చెప్పారు. కానీ.. అదొక ఫన్నీ మూమెంట్ అంటూ ఇంట్రెస్టింగ్ గా చెప్పుకొచ్చారు మంచి విష్ణు.
ఇక మంచు విష్ణు తన మోహన్ బాబు గురించి గురించి మాట్లాడుతూ...'మా నాన్నగారు కష్టపడ్డారు. కార్ షెడ్ లో పడుకున్నారు. తిండి లేక మద్రాసులో అడుక్కుతిన్నారు. ఆయన ఎన్నో కష్టాలు అనుభవించి ఈ స్థాయికి చేరుకున్నారు. ఈరోజు ఆయన కింద 2500 మంది చేస్తున్నారు. మూడు నుండి నాలుగు కోట్ల వరకు జీతాలు ఇస్తున్నారు. ఆయన విద్యాసంస్థల్లో దాదాపు 15,000 మంది విద్యార్థులున్నారు. అలాగే ఇండస్ట్రీలో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్నది' అని మంచు విష్ణు పేర్కొన్నారు.
'మా సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు మినిమం 3 4 డేస్ ముందు మన ఆఫీసుకు ఎవరు రాకూడదని చెప్పేవారు పేమెంట్స్ కూడా ముందే జరిగిపోయే చూసుకునేవారు. ఒకవేళ.. ఇవ్వలేని పరిస్థితిలో పది రోజుల తర్వాత ఇస్తానని ముందే చెప్పి తొమ్మిదవ రోజే వారికి పేమెంట్ చేసేవారు. అలా మాకు క్రమశిక్షణ నేర్పారు. ఆ విషయాలని ఇప్పటికీ ఫాలో అవుతున్నాం. ఈ సమయంలో ఆయనను మేము తప్పు అనడం మూర్ఖత్వమే. ఆయన అన్ని వింటారు. కానీ తాను ఏం చేయాలనుకున్న అది మాత్రమే చేస్తాడు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు విష్ణు.


Click it and Unblock the Notifications











