twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Chiranjeevi నన్ను తప్పుకోమన్నారు!.. చరణ్ పేరు లాగుతూ అన్ని నిజాలు బయటపెట్టిన మంచు విష్ణు

    |

    ఎన్నో రోజుల నుంచి ఉత్కంఠ రేపిన ఎన్నికల ఫలితాలు ఫైనల్ గా విడుదలయ్యాయి. నిన్న సమయం మించిపోవడంతో కేవలం కీలకమైన పదవులు మాత్రమే ఫలితాలు ప్రకటించి ఈ రోజు ఆఫీస్ బేరర్ పదవులు, ఇతర ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొన్నారు. అన్నట్టుగానే ఈరోజు సాయంత్రం వాటి వివరాలు వెల్లడించారు. ఆ తర్వాత మంచు విష్ణు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

    ఫైనల్ గా

    ఫైనల్ గా

    ఎట్టకేలకు మా ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. 925 మెంబర్స్ ఉన్న మా సంస్థలో 883 చెల్లుబాటు అయ్యే ఓట్లు ఉన్నాయి. ఆదివారం నాడు 603 ఓట్లు పోలవ్వగా 54 పోస్టల్ ఓట్లతో కలిసి 655 ఓట్లు పోలయినట్లు అయింది. అధ్యక్ష స్థానానికి పోటీ చేసిన ప్రకాష్ రాజ్ 274 ఓట్లు తెచ్చుకోగా మంచు విష్ణు 383 ఓట్లు తెచ్చుకుని విజయం సాధించారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ స్థానంలో బాబు మోహన్ పై శ్రీకాంత్ గెలిచారు. ఇక 2 వైస్ ప్రెసిడెంట్ స్థానాలకు మాదాల రవి, బెనర్జీ గెలిచారు. ట్రెజరర్ స్థానంలో శివ బాలాజీ 2 జాయింట్ సెక్రటరీ 2 స్థానాల్లో గౌతమ్ రాజు , ఉత్తేజ్ గెలుపొందారు. జనరల్ సెక్రటరీ స్థానంలో రఘు బాబు గెలుపొందగా 18 ఈసీ స్థానాల్లో మంచు విష్ణు ప్యానల్ నుంచి 10 మంది , ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి 8 మంచి గెలుపొందారు.

    మంచు విష్ణు ప్రెస్ మీట్

    మంచు విష్ణు ప్రెస్ మీట్

    ఇక ఎన్నికల పూర్తి ఫలితాలు వెల్లడయ్యాక మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు. మా సభ్యులు నాకు ఓటు వేసి గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు అని పేర్కొన్న విష్ణు మా ప్యానెల్ వారు ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి పని చేశారని అన్నారు. అవతలి ప్యానెల్ వారు కూడా మా సభ్యులేనన్న విష్ణు నాగబాబు గారు మా కుటుంబ సభ్యులే..ఆయన రాజీనామాను నేను యాక్సెప్ట్ చెయ్యననీ అన్నారు. త్వరలోనే నాగబాబు గారిని కలుస్తానన్న విష్ణు జరిగింది జరిగిపోయింది, జరగాల్సింది చూడాలని అన్నారు. ప్రకాష్ రాజ్ రాజీనామాను కూడా నేను అంగీకరించనన్న విష్ణు ప్రకాష్ రాజ్ సలహాలు, సూచనలు కావాలని దాని కోసం రెండు మూడు రోజుల్లో నేను ప్రకాష్ రాజ్ నీ కలుస్తామన్నారు.

    చిరంజీవి తప్పుకోమన్నారు

    చిరంజీవి తప్పుకోమన్నారు

    శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా నటులు తెలుగులో రావాలని కోరిన ఆయన 260 మంది సభ్యులు ప్రకాష్ రాజ్ నీ కోరుకున్నారు ఆయన 'మా'కు కావాలన్నారు. ఇక రామ్ చరణ్ నాకు మంచి మిత్రుడు కానీ చరణ్ ఓటు ప్రకాష్ రాజ్ కే వేసి ఉంటారన్నారు. చరణ్ వాళ్ళ నాన్న చిరంజీవి మాట జవదాటడు అని ఆయన అన్నారు. ఇక నన్ను పోటీలో నుంచి తప్పుకో మంది చిరంజీవి గారే అంటూ బాంబు పేల్చాడు విష్ణు. ఏకగ్రీవం చేసేందుకు ఆయన నన్ను పోటీ నుంచి తప్పుకోమన్నారు కానీ తప్పుకోలేదని అన్నారు.

    నాన్న వల్లే గెలిచా

    నాన్న వల్లే గెలిచా

    ఈ విషయం చెప్పకూడదునుకున్నా. కానీ ఎన్నికలు అయిపోవడం వల్ల చెబుతున్నానని అన్నారు. నిజానికి ఒక ఇంటర్వ్యూలో మోహన్ బాబు కూడా ఈ విషయాన్ని చూచాయగా వెల్లడించారు. ఇండస్ట్రీ నుంచి ఒక పెద్ద మనిషి తనకు ఫోన్ చేశారని పోటీ నుంచి తప్పుకోవాలని అడిగితే మీ ఇంటి నుంచి ఎవరైనా పోటీ చేస్తూ ఉంటే కచ్చితంగా తప్పుకుంటానని అన్నాను అని చెప్పుకొచ్చారు. ఇక ఇండస్ట్రీకి ఏమి కావాలో అవి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి కోరతానని పేర్కొన్న విష్ణు నా గెలుపు మా నాన్న వల్లే అని ఆయన వల్లే గెలిచానని అన్నారు. మోహన్ బాబు గారి అబ్బాయికి ఓటు వేద్దామని సభ్యులు ఓట్లు వేశారని తద్వారా నా ప్యానెల్ కి మంచి మెజారిటీ వచ్చిందన్నారు. మేము చెప్పింది చేస్తామన్న ఆయన బాగా చేశాడు విష్ణు అని అనిపించుకుంటానన్నారు.

    Recommended Video

    MAA Elections: జ‌య‌ల‌లిత త‌మిళ‌నాడులో CM అవ్వలేదా.. క‌ళ‌కు ప్రాంత‌మేంటి ? Jeevitha
    మోహన్ బాబు ఏమన్నారంటే?

    మోహన్ బాబు ఏమన్నారంటే?

    ఇక మోహన్ బాబు మాట్లాడుతూ దేవుని నిర్ణయం మేరకు జరిగిందని, ఇది అందరి విజయం అని అన్నారు. సింహం నాలుగు అడుగులు ముందుకు వేస్తే వెనకడుగు వేసినట్టు కాదని, నన్ను రెచ్చగొట్టాలని చూస్తున్నారని అన్నారు. నేను అసమర్థుడును కానన్న ఆయన అన్నీ నవ్వుతూ స్వీకరించాలన్నారు నోరు వుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదని, ఇప్పుడు జరిగిన మా ఎన్నికల గురించి వరల్డ్ వైడ్ గా మాట్లాడుకున్నారన్నారు. నూతన కార్యవర్గం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలసి మాకు సహకరించాలి అని కోరాలని, ప్రతి సంవత్సరం కళాకారులు ముఖ్య మంత్రిని సన్మానించుకోవడం అలవాటు కానీ ఇప్పటి దాకా కేసీఆర్ ను సన్మానించారా? అని ఆయన ప్రశ్నించారు.

    English summary
    Manchu Vishnu made sensational comments on megastar chiranjeevi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X