For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పక్కపక్కనే మంచు విష్ణు, పవన్ కళ్యాణ్.. ఇద్దరికీ సన్మానం.. వీడియో షేర్ చేసిన విష్ణు..అసలు ఏమైదంటే?

  |

  గత కొద్ది రోజులుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో పాల్గొన్న మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మద్దతుదారులు రెండు వర్గాలు రెండుగా విడిపోయి ఒకరిమీద ఒకరు భారీ ఎత్తున విమర్శలు కూడా చేసుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ సమయంలో మంచు విష్ణు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మూవీ ఇండస్ట్రీ కి సంబంధం లేదు అన్నట్లుగా చేసిన కామెంట్లు రచ్చ రేపాయి. అయితే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన మంచు విష్ణు కూర్చుని ఒక వీడియో షేర్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

  పవన్ వైపా? ఇండస్ట్రీ వైపా?

  పవన్ వైపా? ఇండస్ట్రీ వైపా?

  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద మంచు విష్ణు కొన్ని సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద విమర్శల వర్షం కురిపించారు.

  అయితే అది పవన్ వ్యక్తిగత ఉద్దేశాలని టాలీవుడ్ కి పవన్ కామెంట్స్ కు ఎలాంటి సంబంధం లేదని టాలీవుడ్ ఫిలిం ఛాంబర్ ఒక లేఖ రాసింది. ఆ లేఖను ఉద్దేశించి మంచు విష్ణు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఇండస్ట్రీకి సంబంధం లేదని చాంబర్ ఆఫ్ కామర్స్ లేఖ రాసిందని తాను చాంబర్ ఆఫ్ కామర్స్ వైపే ఉన్నాను ప్రకాష్ రాజ్ ఎవరివైపు ఉన్నారో చెప్పాలని కామెంట్లు చేశారు.

  దుమారం రేపిన కామెంట్లు

  దుమారం రేపిన కామెంట్లు

  ఈ కామెంట్ లు పెను దుమారం రేపాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ షో కలెక్షన్ అంత ఉండవు నీ సినిమా బడ్జెట్లు అంటూ ప్రకాష్ రాజ్ కామెంట్ చేయడం, ఆ తర్వాత నాగబాబు మంచు విష్ణు క్షమాపణ చెప్పాల్సిందేనని కోరడం, మంచు విష్ణు చెప్పను అని చెప్పడంతో మొత్తం మీద ఈ వ్యవహారం అంతకంతకు దూరం వెళుతూనే ఉంది.

  అయితే మంచు విష్ణు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్య ఏదో జరిగిపోయింది రెండు కుటుంబాల మధ్య దూరం కూడా పెరిగిపోయిందని అని అందరూ అనుకుంటున్న సమయంలో మంచు మనోజ్ వెళ్లి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యి షాక్ ఇచ్చారు.

  పక్కపక్కనే పవన్, మంచు విష్ణు

  ఇక ఈ రోజు జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ఇద్దరూ ఒకే వేదిక మీద ఉండగా మంచు విష్ణు తన పక్కన ఎవరున్నారో చూడాలి అంటూ ఒక చిన్న వీడియో తీసి తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశాడు. ఈ టాపిక్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ అయితే మంచు విష్ణు ఇలాంటి వీడియోలు పెట్టాల్సిన అవసరం లేదని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇలాంటివి పట్టించుకోరని అంటున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

  ప్ర‌తి ఏడాది

  ప్ర‌తి ఏడాది

  దసరా పండుగ తర్వాత ప్ర‌తి ఏడాది నిర్వ‌హించే 'దత్తన్న అలయ్ బలయ్' కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లోని జ‌ల‌విహార్‌లో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ప‌లువురు ప్ర‌ముఖులు, ప‌లు పార్టీల నేతలు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయిన ఈ కార్యక్రమానికి, తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సౌంద‌ర రాజ‌న్, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్, సినీన‌టుడు కోట శ్రీ‌నివాస‌రావు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మా అధ్య‌క్షుడు మంచు విష్ణు కూడా వ‌చ్చారు.

  MAA Elections: జ‌య‌ల‌లిత త‌మిళ‌నాడులో CM అవ్వలేదా.. క‌ళ‌కు ప్రాంత‌మేంటి ? Jeevitha
  మంచు విష్ణు-పవన్ లకు సన్మానం

  మంచు విష్ణు-పవన్ లకు సన్మానం

  ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ప‌లు పార్టీల నేత‌లు కూడా ఈ కార్య‌క్ర‌మానికి హాజరయ్యారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా కళాకారులు నృత్యాలతో అల‌రించారు. అనంతరం అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో పలువురు ప్రముఖులను కూడా సన్మానించారు. భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌ కృష్ణ యేళ్ళ, డాక్టర్‌ రెడ్డీస్‌ లేబోరేటరీస్‌ అధినేత ప్రసాద్‌ రెడ్డి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ) ఛైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి, బయోలాజికల్‌-ఇ ఎండీ మహిమ దాట్ల, 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు లను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సన్మానించారు.

  English summary
  Manchu vishnu shares a video of pawan kalyan at Alai Balai.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X