twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Manchu Vishnuకు పవన్ హగ్.. ఇదిగో ప్రూఫ్ అంటూ వీడియో పోస్ట్ చేసిన విష్ణు.. అందుకే మాట్లాడలేదట!

    |

    హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ దసరా తర్వాత నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, 'మా' అసోసియేషన్ నూతన అధ్యక్షుడు మంచు మనోజ్ తదితరులు హాజరయ్యారు. 'మా' ఎన్నికల నేపథ్యంలో సినీ పరిశ్రమలో వివాదాలు ఏర్పడగా అలయ్ బలయ్ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ తో మంచు విష్ణు మాట్లాడే ప్రయత్నం చేసినా... పవన్ స్పందించలేదని, అసలు పట్టించుకోలేదని వార్తలు వచ్చాయి. ఆ విషయం మీద తాజాగా మంచు విష్ణు మరో వీడియో పోస్ట్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే

    అసలు మాట్లాడుకోలేదు

    అసలు మాట్లాడుకోలేదు

    అలయ్-బలయ్ వేదిక మీద పవన్ కళ్యాణ్, 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదని మీడియా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. నిజానికి అదే రోజున మంచు విష్ణు ఓ వీడియో పోస్ట్ చేసి ఇందులో ఉన్న వ్యక్తి ఎవరో గుర్తు పట్టగలరా? అంటూ పవన్ వీడియో షేర్ చేసి మరీ ప్రశ్నించడం మరింత వివాదాస్పదమైంది.

    అందుకే మాట్లాడలేదు

    అందుకే మాట్లాడలేదు

    ఈ నేపథ్యంలో నిన్న మంచు విష్ణు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు, మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని, స్టేజ్ పైకి వెళ్లక ముందు తామిద్దరం చాలా సేపు మాట్లాడుకున్నాం అని ఆ విషయాన్ని మీడియా చూపించలేదని అన్నారు. 'మా' మన తల్లి వంటిది... జాగ్రత్తగా చూసుకో విష్ణు అని పవన్ తనతో చెప్పారని ఆయన వెల్లడించారు. స్టేజి పైన ఉపరాష్ట్రపతి ఉన్నారు కాబట్టి అక్కడ తాము మాట్లాడుకోవడానికి ప్రొటోకాల్ ఒప్పుకోదని విష్ణు అన్నారు.

    పవన్ తో హగ్

    దానికి తగ్గ ప్రూఫ్ దొరకడంతో ఆయన దానిని షేర్ చేశారు. విష్ణు షేర్ చేసిన వీడియోలో పవన్ కళ్యాణ్ మంచు విష్ణుని హగ్ చేసుకోవడమే కాకుండా.. ఆయనతో మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. ఇక మా ఎన్నికల వ్యవహారం అయితే ఇంకా చల్లార లేదనే చెప్పాలి. మా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని నిరూపించాల్సిన బాధ్యత ప్రకాష్ రాజ్ ప్యానెల్ దేనని వాళ్ళు కోరినట్లు సీసీటీవీ ఫుటేజీని నిరభ్యంతరంగా చూసుకోవచ్చని విష్ణు అన్నారు.

    లేఖలే అందలేదు

    లేఖలే అందలేదు

    అయితే మంచు విష్ణుతో కలిసి పనిచేసే పరిస్థితి ఉండదని, గెలిచిన తమ వాళ్లంతా రాజీనామా చేస్తారని ప్రకాష్ రాజ్ ప్యానెల్ ప్రకటించినా, ఇప్పటి వరకు అధికారికంగా రాజీనామా లేఖలు అందలేదని మా అధ్యక్షుడు తెలిపారు. 'కేవలం ఒకే ఒక్క లేఖ వచ్చింది, అది కూడా నాగబాబుది అని మిగతా వాళ్ల రాజీనామాలు నాకు అందలేదు. అయితే వాటిని మేం ఆమోదించాలనుకోవట్లేదు..'అని విష్ణు తాజాగా పేర్కొన్నారు.

    సీసీ ఫుటేజ్ పరిశీలించిన ప్రకాష్ రాజ్

    సీసీ ఫుటేజ్ పరిశీలించిన ప్రకాష్ రాజ్

    సోమవారం మధ్యాహ్నం 'మా' ఎన్నికల పోలింగ్ సీసీటీవీ ఫుటేజీని తన ప్యానెల్ సభ్యులు అయిన బెనర్జీ - తనీష్ లతో కలిసి జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లో ప్రకాష్ రాజ్ పరిశీలించారు. పోలీసుల సమక్షంలో సీసీ ఫుటేజీని పరిశీలించిన ప్రకాష్ రాజ్ 'మా' ఎన్నికల ఓట్ల లెక్కింపుపై కొన్ని సందేహాలు ఉన్నాయని.. వాటిని నివృత్తి చేసుకోవడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చామని తెలిపారు.

    మంచు విష్ణుకి థాంక్స్

    మంచు విష్ణుకి థాంక్స్

    సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన అనంతరం ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ''అనుమానాలను నివృత్తి చేసుకోవడం కోసమే పోలింగ్ సెంటర్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించామని, ఇంకా ఎన్నికల అధికారి వద్ద ఏడు కెమెరాల ఫుటేజీ ఉంది. దానిని కూడా పరిశీలించిన తర్వాత మేము మీడియా ముందుకు వస్తామని పేర్కొన్నారు. సీసీ ఫుటేజీ పరిశీలించడానికి అంగీకారం తెలిపిన మంచు విష్ణుకి ధన్యవాదాలు కూడా ఆయన తెలియజేశారు.

    English summary
    Manchu vishnu shares a video pawan kalyan huggind him.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X