For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అల్లు అర్జున్‌పై మంచు విష్ణు అసూయ.. డైరెక్ట్ గా అలా మెస్సేజ్ చేయడంతో..

  |

  ఇటీవల కాలంలో మంచు విష్ణు గతంలో ఎప్పుడూ లేని విధంగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. హీరోగా సినిమాలతో సక్సెస్ కాకాపోయినప్పటికీ మంచు విష్ణు మా ఎన్నికల్లో మాత్రం భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ పై వంద ఓట్ల తేడాతో విజయాన్ని అందుకున్నారు. మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశాడు. ఇక ఎన్నికలు ముగిసిన అనంతరం కూడా ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ అవుతోంది. మంచు విష్ణు మాత్రం కూల్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్తాను అని ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా సినీ హీరోలతో ఉన్న అనుబంధం గురించి ఒక క్లారిటీ ఇచ్చాడు. అయితే బన్నీ విషయంలో మాత్రం అసూయగా ఫీల్ అవుతుంటాను అని ఓపెన్ గా చెప్పేశాడు.

   నూతన మా అధ్యక్షుడిగా..

  నూతన మా అధ్యక్షుడిగా..

  మంచు విష్ణు మా ఎన్నికల్లో విజయం సాధిస్తాడు అని ఎవరూ ఊహించలేదు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఎప్పటి నుంచో సీనియర్ గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా ప్రకాష్ రాజు కు మద్దతు పలికారు. అయినప్పటికీ కూడా ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు ఘన విజయం సాధించాడు. మోహన్ బాబు కూడా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారనే చెప్పాలి. సీనియర్ నటీనటుల మద్దతు కోరడంతో ఒక్కసారిగా ఫలితాలు మారిపోయాయి అనే టాక్ కూడా వచ్చింది. ఇక గొడవలు ఎన్ని కొనసాగిన కూడా ఆఖరికి మంచు విష్ణు మంచి విజయాన్ని అందుకొని నూతన మా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు.

  వాళ్ళు మంచి స్నేహితులు

  వాళ్ళు మంచి స్నేహితులు

  ఇక మంచు విష్ణు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీ లో ఉండే హీరోలపై కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. దాదాపు ఇండస్ట్రీలో ఉన్న యువ హీరోలు అందరూ కూడా తనకు మంచి స్నేహితులు అంటూ మోహన్ బాబు చిరంజీవి మధ్యలో విభేదాలు వచ్చినట్లు కేవలం మీడియా మాత్రమే సృష్టించిన కథనాలు అని, వారు ఎప్పటిలానే మంచి స్నేహితులుగా ఉన్నట్లు విష్ణు తెలియజేశాడు. ఇక ఎన్నికల అనంతరం కూడా మోహన్ బాబు చిరంజీవి ఫోన్లో మాట్లాడుకున్నట్లు కూడా తెలియజేశాడు.

  మెగా హీరోలతో అనుబంధం

  మెగా హీరోలతో అనుబంధం

  నాగబాబు పలు కాంట్రవర్సీ కామెంట్స్ చేసినప్పటికీ కూడా మెగా ఫ్యామిలీతో తనకు మంచి అనుబంధం ఉందని అంటూ సాయి ధరంతేజ్ తనకు ఒక సోదరుడు అని అన్నాడు. ఇక అల్లు అర్జున్ ఫ్యామిలీ కూడా తనకు ఎంతో బాగా తెలుసు అంటూ అల్లు శిరీష్ కూడా తనకు తమ్ముడు లాంటివాడు అని తెలియజేశాడు. అల్లు అర్జున్ తో అయితే ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉందని చెప్పుకొచ్చాడు.

  అల్లు అర్జున్ పై అసూయ..

  అల్లు అర్జున్ పై అసూయ..

  అల్లుఅర్జున్ గురించి మాట్లాడుతూ.. బన్నీ విషయంలో నేను ఎప్పటికీ ఒక విషయంలో మాత్రం అసూయగా ఫీలవుతూ ఉంటాను. అంతే కాకుండా మరొక విషయంలో అతన్ని చూసి చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతాను. ఆ విషయాన్ని బన్నీకి చాలా సార్లు డైరెక్ట్ గానే చెప్పడం జరిగింది. బన్నీతో నాకు ఎక్కువగా ఫోన్ ద్వారానే బాండింగ్ ఏర్పడింది. అతను నేను రెగ్యులర్ గా మెసేజ్ లు చేసుకుంటూ ఉంటాము అని అన్నాడు.

  ఆ విషయంలో గర్వంగా..

  ఆ విషయంలో గర్వంగా..

  అయితే బన్నీ పుష్ప సినిమా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సినిమాతో పోటీ పడుతోంది. ఆయన నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక అదే సమయంలో పుష్ప సినిమా కూడా అంత పెద్ద సినిమాతో పోటీకి సిద్ధం అయ్యింది. కాబట్టి ఒక విధంగా ఆ విషయంలో నేను బన్నీపై అసూయ చెందినప్పటికీ కూడా మరొక విధంగా మన తెలుగు హీరో అంత పెద్ద స్టార్ తో పోటీ పడుతున్నాడు అంటే చాలా మంచి విషయం. కాబట్టి ఆ విధంగా బన్నీని చూసి ఎంతగానో గర్వపడుతూ ఉంటాను.

  MAA Elections: జ‌య‌ల‌లిత త‌మిళ‌నాడులో CM అవ్వలేదా.. క‌ళ‌కు ప్రాంత‌మేంటి ? Jeevitha
  బన్నీ కూడా ఆ విషయం నాతో చెప్పాడు

  బన్నీ కూడా ఆ విషయం నాతో చెప్పాడు

  బన్నీ కి చాలా సార్లు అసూయ పడిన విషయాన్ని అలాగే గర్వపడిన విషయాన్ని కూడా ఫోన్ ద్వారా తెలియజేశాను. అతను కూడా తనకు సంబంధించిన పలు విషయాల్లో అసూయ పడుతూ ఉంటాడు. అంతేకాకుండా గర్వపడుతూ కూడా ఉంటానని తనకు మెసేజ్ చేసినట్లు మంచు విష్ణు తెలియజేశాడు. ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ కూడా నేటి తరం జనరేషన్ హీరోలు మాత్రం అందరూ కూడా తనతో చాలా స్నేహంగా ఉంటారు అని విష్ణు పాజిటివ్ గా వివరణ ఇచ్చాడు.

  English summary
  Manchu vishnu shocking comments on allu arjun pushpa movie,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X