»   »  సిక్స్ ప్యాక్‌లో కనిపించబోతున్న మంచు విష్ణు

సిక్స్ ప్యాక్‌లో కనిపించబోతున్న మంచు విష్ణు

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: హీరో మంచు విష్ణు సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించబోతున్నాడు. మంచు ఫ్యామిలీ స్టార్స్ అయిన మోహన్ బాబు, విష్ణు, మనోజ్‌లతో రూపొందుతోన్న మల్టీ స్టారర్ సినిమాలో విష్ణు సిక్స్ ప్యాక్‌లో కనిపించనున్నాడు. సిక్స్ ప్యాక్ కోసం గత కొన్ని రోజులుగా విష్ణు ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.

ఈ చిత్రంలో వరుణ్‌ సందేశ్‌, తనీష్‌లు కూడా నటిస్తున్నారు. శ్రీవాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో దాసరి ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తారని సమాచారం. దాసరి- మోహన్‌బాబుల మధ్య గురుశిష్యుల సంబంధం ఉంది. ఆ అనుబంధంతోనే దాసరి ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకొన్నారని తెలిసింది. ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్‌ సంస్థపై మంచు విష్ణు, మనోజ్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మోహన్ బాబు సరసన ...ప్రముఖ హిందీ నటి రవీనా టాండన్‌ కనిపించనుంది. ఆమెతోపాటు హన్సిక, ప్రణీత హీరోయిన్స్. మంచు విష్ణు గతంలో ఓ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ''మేమిద్దరం హీరోలుగా నిలదొక్కుకోవడానికి డాడీయే స్ఫూర్తి. ఆయన శ్రమ మమ్మల్ని నిలబెట్టింది. ఇప్పుడు డాడీ హీరోగా మేం సినిమాను నిర్మించడం సంతోషంగా ఉంది. ఆయనతో కలిసి నటించబోతున్నామనే విషయం ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఆద్యంతం వినోదాన్ని పంచే కుటుంబ కథా చిత్రమిది'' అన్నారు.

ఎన్నో ప్రత్యేకతలతో, ఇంతవరకూ తెలుగులో రానివిధంగా ఈ చిత్రం నిర్మాణం కాబోతోంది. ఇది ఆహ్లాదకరమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. మాకు సినీ జన్మను ప్రసాదించిన మా తండ్రి మోహన్‌బాబుతో మొదటిసారి మేం నిర్మిస్తున్న ఈ చిత్రం అందరి అంచనాలనూ మించి ఉంటుందని చెప్పుకొచ్చారు. రచన: గోపీ మోహన్‌, కోన వెంకట్‌, బీవీయస్‌ రవి, ఛాయాగ్రహణం: పళనికుమార్‌, సమర్పణ: అరియానా, వివియానా.

English summary

 Manchu Vishnu is going developing a six pack body and is all set to flaunt his abs in his next untitled film starring Mohan Babu, Manoj, Tanish and Varun Sandesh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu