విష్ణు కొడుకును ఎవరూ ఆపలేరట.. ఆసక్తిగా మంచు మూడోతరం వారసుడి పేరు..

By Rajababu

Recommended Video

విష్ణు కొడుకును ఎవరూ ఆపలేరట..!

ప్రముఖ నటుడు మోహన్‌బాబు కుమారుడు, సినీ నటుడు మంచు విష్ణు ఇంట్లో మూడోతరం వారసుడి రాకతో ఉత్సాహం పొంగి పొర్లుతున్నది. విష్ణు భార్య వెరోనికా హైదరాబాద్‌లో జనవరి 1వ తేదీన పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతివ తెలిసిందే. దీంతో మంచు కుటుంబానికి న్యూ ఇయర్ వేడుకలతోపాటు వారసుడు వచ్చిన ఆనందం వారిని ఊపేస్తున్నది. మంచు విష్ణు కుమారుడి పేరు ఆసక్తికరంగా ఉండటం మీడియాలో చర్చనీయాంశమైంది.

నా కొడుకు పేరు

తన ముద్దుల చిన్నారికి పేరు పెట్టినట్టు మంచు విష్ణు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. నా కుమారుడికి అవ్రామ్ భక్త అని పేరు పెట్టాం అని ఆయన వెల్లడించారు. అవ్రామ్ అంటే ‘ఎవరూ ఆపలేరు' అని అర్థం అని చెప్పారు.

పట్టలేని ఆనందంలో మంచు ఫ్యామిలీ

పట్టలేని ఆనందంలో మంచు ఫ్యామిలీ

మంచు ఇంట్లోకి చిన్నారి రాకతో మోహన్‌బాబు కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగిపోతున్నారు. విష్ణు కుమార్తెల ఆనందం గురించి ఇక చెప్పనక్కర్లేదు. అవ్రామ్‌ను అరియానా లయన్ అని పిలుస్తుండగా, వివియానా బేబీ టెడ్డీబేర్ అని పిలుస్తున్నట్టు వారు వెల్లడించారు.

 సంతోషంలో మోహన్‌బాబు

సంతోషంలో మోహన్‌బాబు

మనవడు పుట్టడంపై మోహన్ బాబు ఇటీవల ట్విట్టర్‌ ద్వారా తన సంతోషాన్ని పంచుకొన్న సంగతి తెలిసిందే. నటుడిగా బిజీగా ఉండటం వలన నేను నా బిడ్డలతో క్వాలిటీ సమయాన్ని గడుపలేకపోయాను. ఇక నా మనవడితోనే మూడు షిఫ్టులు గడుపుతాను అని మోహన్‌బాబు వెల్లడించారు.

 మంచు కుటుంబంలో మూడోతరం

మంచు కుటుంబంలో మూడోతరం

మోహన్ బాబు తరం, విష్ణు, మనోజ్ తర్వాత అవ్రామ్‌ భక్తతో మంచు వారి వంశంలో మూడోతరం మొదలైంది. మూడో తరం వారసుడు రాకతో మోహన్‌బాబు ఇంటికి కొత్త కళ వచ్చింది. పలువురు స్నేహితులు, సన్నిహితులు వారి ఇంటికి వచ్చి సంతోషంలో భాగస్వామ్యం అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X