హీరోయిన్స్ విషయంలో మంచు విష్ణు స్ట్రాంగ్ వార్నింగ్..హద్దు మీరుతున్నారు.. జాగ్రత్త!

నూతనంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు యూట్యూబ్ ఛానల్స్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూట్యూబ్ ఛానల్స్ మితిమీరి ప్రవర్తిస్తున్నాయని, థంబ్ నైల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆ వివరాల్లోకి వెళితే

సోషల్ మీడియా పరిధి

సోషల్ మీడియా పరిధి

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సోషల్ మీడియా పరిధి కూడా అంతకంతకూ పెరుగుతోంది.. రోజుకో రకమైన సోషల్ మీడియా మాధ్యమం పుట్టుకు వస్తూ ఉన్న క్రమంలో వాటి నుంచి డబ్బు కూడా దండిగా వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో యూట్యూబ్ లాంటి ప్లాట్‌ఫామ్స్ డబ్బు సంపాదనకు అవకాశం ఉండడంతో పెద్ద ఎత్తున యూట్యూబ్ ఛానల్స్ పుట్టుకు వస్తున్నాయి. అయితే వీటిలో కొన్ని ఛానల్స్ మాత్రం తప్పుడు థంబ్‌నైల్స్‌ పెట్టి వీక్షకులను తప్పుదోవ పట్టించడమే గాక కాక కొందరు నటీనటులను లేనిపోని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి.

దారుణంగా

దారుణంగా

తాజాగా ఈ విషయంపై 'మా' అధ్యక్షులు మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ సన్మాన కార్యక్రమంలో మీడియాను ఉద్దేశించి మాట్లాడిన 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు.. హీరోయిన్ల విషయంలో అభ్యంతరకర వీడియోలు పెడితే తాము ఉపేక్షించేది లేదని, కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు నటుల పట్ల దారుణంగా ప్రవరిస్తున్నాయని చెప్పిన విష్ణు అలాంటి వారిని వెతికి పట్టుకొని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యూట్యూబ్‌ ఛానళ్ల థంబ్‌నైల్స్‌ హద్దులు మీరుతున్నాయని, అలా అసభ్యకరంగా వ్యవహరించే యూట్యూబ్ ఛానళ్లపై చర్యలు తప్పవని మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చారు.

ఊరుకునేది లేదు

ఊరుకునేది లేదు

హీరోయిన్స్ అంటే మన ఆడపడుచలని, వారిని గౌరవించాలని మంచు విష్ణు విజ్ఞప్తి చేశారు. అలాంటి హీరోయిన్లపై అభ్యంతరకర వీడియోలు పెడితే ఊరుకునేది లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇప్పటికే వుమెన్ ఎంపవర్మెంట్ కోసం ఒక కమిటీ వేశామన్న ఆయన యూట్యూబ్‌ ఛానళ్ల నియంత్రణకు, వాటిపై నిఘా పెట్టేందుకు గాను ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి లీగల్‌ సెల్‌ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇప్పటికే ఈ విషయమై యూట్యూబ్‌తో డిస్కస్ చేశామని, ఇలా తప్పుగా వ్యవహరించే అన్ని ఛానళ్లపై చర్యలు తీసుకోవడం ఖాయమని ఆయన అన్నారు.

నిర్ణయం తీసుకుంటా

నిర్ణయం తీసుకుంటా

ఇక మరో పక్క నిన్న కొత్తగా ఎన్నికైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుల సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. మా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలపై చర్చించారు. ఈ సమావేశంలో మా అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ సభ్యుల రాజీనామాలతో పాటు నాగబాబు రాజీనామాపై చర్చించినట్లు చెప్పారు. త్వరలోనే వారి రాజీనామాలపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇక తన నిర్ణయాలు రాడికల్ గా ఉంటాయని విష్ణు అన్నారు.

Recommended Video

MAA Elections: జ‌య‌ల‌లిత త‌మిళ‌నాడులో CM అవ్వలేదా.. క‌ళ‌కు ప్రాంత‌మేంటి ? Jeevitha
 రాడికల్ నిర్ణయాలు

రాడికల్ నిర్ణయాలు

తాను రాడికల్‌ను అని, రాడికల్ నిర్ణయాలు తీసుకుంటానని, మేనిఫెస్టోలో ఇచ్చిన 14 హామీల అమలే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. ఇక ఎప్పుడు రాజీనామా గురించి.నిర్ణయం తీసుకుంటారు? అని ప్రశ్నించగా ఎప్పుడైనా తీసుకుంటామని అన్నారు. ఇక మా సభ్యుల ఆరోగ్య సంక్షేమం కోసం పలు కార్పోరేట్ హాస్పిటల్స్‌తో ఒప్పందం చేసుకోనున్నట్లు మంచు విష్ణు వెల్లడించారు. ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ ఎన్నికల్లో గెలిచిన ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామాలను ఈసీ తిరస్కరించినట్టు తెలుస్తోంది. ఈ విషయం మీద లేఖ రాసే అవకాశం ఉందని అంటున్నారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X