మోహన్ బాబు కి టెలీగ్రామ్ ఇచ్చిన మంచు విష్ణు
మంచు విష్ణు ట్వీట్ చేస్తూ... "నేను పర్శనల్ గా ఇప్పటివరకూ ఎప్పుడు టెలీగ్రామ్ లు ఇవ్వలేదు. నా పెళ్లి సమయంలోనూ,సినిమా విడుదల సమయంలోనూ చాలామంది ఆప్తులు టెలీగ్రామ్ లు శుభాకాంక్షలు తెలియచేసారు.నేను ఒకసారైనా టెలీగ్రామ్ ఇవ్వాలనుకున్నారు. సర్వీస్ నిలిపివేస్తున్న చివరి రోజున ఈ టెలీగ్రామ్ ఇచ్చాను " అని ట్వీట్ చేసారు.
ఇక తన తండ్రికి ఇచ్చిన టెలీగ్రామ్ లో.." నాన్నా నువ్వే మా హీరో, లవ్ యూ మామ్ ," అని ఉంది. ప్రస్తుతం మంచు విష్ణు..దూసుకెల్తా చిత్రం షూటింగ్ లో బిజీగా ఉంది. వీరూపోట్ల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. చిత్రం పూర్తి ఫన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోందని సమాచారం.
చిత్రం గురించి విష్ణు మాట్లాడుతూ ''కథకు అతికినట్లు సరిపోయే పేరు అదే. వినోదం, యాక్షన్ అంశాలు సమపాళ్లలో మేళవించి ఉంటాయి. నిదానమే ప్రధానం.. అనే మాట అస్సలు పట్టించుకోడు. వేగం కూడా విస్తుపోయేలా దూసుకెళ్తేనే విజయం.. అనేది అతను నమ్మే సిద్ధాంతం. ఆ ప్రయాణంలో అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే ''అన్నారు.
ఇక ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో చిత్రీకరణ సాగుతోంది. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ, ఆహుతి ప్రసాద్, రావు రమేష్, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: సర్వేష్ మురారి, కళ: రఘు కులకర్ణి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయ్, సమర్పణ: అరియానా, వివియానా.


Click it and Unblock the Notifications












