కడుపుతో ఉన్న భార్యతో విష్ణు ఫోజులు
మంచు వారి కోడలు..హీరో విష్ణువర్థన్ సతీమణి విరోనికా రెడ్డి ప్రస్తుతం గర్భవతి అన్న సంగతి తెలిసిందే. కవల పిల్లకు జన్మనివ్వబోతోంది వోరోనికా. న్యూయార్క్ ప్రెస్బిటేరియన్ హాస్పిటల్‌లో అడ్మిట్ ఆమె అయ్యారు. వీల్ కార్నెల్ 525 ఈస్ట్ 68వ వీధి- న్యూయా ర్క్‌లో ఈ ఆసుపత్రి ఉంది.
ఇదిలా ఉంటే...కడుపుతో ఉన్న తన భార్యతో హీరో మంచు విష్ణు దిగిన ఫోటోలు మీడియాకు విడుదల చేశారు. ఇప్పడు ఇవి నెట్ లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. మంచు వారి అభిమానులు ఫోటోలను ఒకరికొకరు సెండ్ చేసుకుంటూ తెగ సంబర పడి పోతున్నారు.
ఈ ఫోటోలను చూస్తుంటే విష్ణుకు తన భార్యపై ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుంది. ప్రతిక్షణం ఆమె దగ్గరే ఉండి బాగోగులు చూసుకుంటున్నాడని అర్థం అవుతోంది. నిజంగా భర్త అంటే ఇలానే ఉండాలి అంటూ...ఈర్ష్య పడుతున్నారు మంచు వారి మహిళా అభిమానులు. తెలుగు సినీ స్టార్ విష్ణు...సినీ వినీలాకాశంలో వెలిగిపోయే మరో ఇద్దరు స్టార్లకు జన్మనివ్వాలని కోరుకుంటున్నారంతా...


Click it and Unblock the Notifications











