మా ఆవిడిది ఖరీదైన డెలివరీ:మంచు విష్ణు

By Srikanya

ఇది చాలా ఖరీదైన డెలివరీ. ఎవరెవరు న్యూయార్క్ వెళ్లాలో ఇటీవల ఓ లిస్ట్ వేశాం. మొత్తం 98మంది అయ్యాం. ఈ 98మంది కాకుండా మరో 40 మంది వరకు ఫ్లయిట్ టిక్కెట్లు ఎరేంజ్ చేయాల్సి ఉంది. నవంబర్‌లో మొత్తం అందరం న్యూయార్క్‌లో వాలిపోతాం. మా కుటుంబం అంతా చాలా ఆనందంగా ఉంది అన్నారు అంటున్నారు మంచు విష్ణు. ఆయన త్వరలో తండ్రి కాబోతున్నారు. ఆయనకు కవలలు పుడతారని స్కానింగ్ లో తేలింది. డిసెంబర్ ప్రథమార్ధంలో అతని భార్యకు డెలవరి కాబోతోంది.తను ఏ ఆస్పత్రిలో (ప్రెస్‌బిటేరియన్ ఆస్పత్రి) అయితే పుట్టారో అదే ఆస్పత్రిలో బిడ్డలకు జన్మనివ్వబోతున్నారు విరానికా. పెళ్లికి ముందు తన భర్త విష్ణుకి ఈ కండిషన్ పెట్టారట. భార్య ఇష్టప్రకారం ఆమె కోరుకున్న ఆస్పత్రిలో డెలివరీ జరగడానికి ఆమోదించారు విష్ణు. ఆ ఆస్పత్రి ఉన్నది ఇండియాలో కాదు న్యూయార్క్‌లో. అందుకే విరానికా దాదాపు 20రోజుల క్రితం న్యూయార్క్ వెళ్లారు.

ఇక ఈ విషయమై విరానికా ట్విట్టర్ లో రాస్తూ...విష్ణు బుగ్గలు సొట్ట పడతాయి కాబట్టే.. తనకు పుట్టబోయే బిడ్డల్లో కనీసం ఒకరికైనా.. అలా సొట్టబుగ్గలుంటాయని ఆమె భావిస్తున్నారు. కచ్చితంగా ఒక బిడ్డకైనా బుగ్గలు సొట్టపడతాయని అనుకుంటున్నాను. నో డౌట్. ఫోర్ డి స్కానింగ్ చేయించాం. బిడ్డల రూపురేఖలు చూశాను. క్యూట్‌గా ఉన్నారు అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.అలాగే కవలపిల్లలు కాబట్టి ఒక బాబు, ఒక పాప పుడితే బాగుంటుందని ఆమె అనుకుంటున్నారు. కానీ విష్ణు మాత్రం పాపాయిలే కావాలంటున్నారు. ఈ విషయం గురించి ఆయన చెబుతూ నాకు మాత్రం ఆడపిల్లలే కావాలని ఉంది. ముద్దులొలికే ఆ పాపాయిలు ఇంట్లో తిరుగుతుంటే ఇల్లంతా కళకళలాడుతుంది అన్నారు. విరానికా, పుట్టబోయే బిడ్డలకు దగ్గరగా ఉండాలనే ఆలోచనతో విష్ణు తను చేయబోయే తాజా చిత్రం షూటింగ్‌ను డిసెంబర్‌కి వాయిదా వేశారు.జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన లొకేషన్స్‌ని సెలక్ట్ చేయడం కోసం ఇటీవల విష్ణు యూరప్ వెళ్లొచ్చారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న విరానికా ఇంటిపట్టున ఉండి... పుట్టబోయే బిడ్డల కోసం ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X