తాప్సి కొత్త చిత్రం 'వస్తాడు నా రాజు' స్టోరీ పాయింట్ ఏమిటంటే..
క్రీడాకారుడికీ, ఓ అందాల భామకీ మధ్య సాగే సరదా ప్రేమాయణమే మా కథ. ప్రతి సన్నివేశం వినోదభరితంగా ఉంటుందని దర్శకుడు హేమంత్ మధుకర్ 'వస్తాడు నా రాజు' చిత్రం కధ గురించి చెప్పుకొచ్చారు.అలాగే ప్రతీ అమ్మాయికీ తనకెలాంటి కలల రాకుమారుడు వస్తాడో అని కలలు ఉంటాయి. తాను కోరుకున్న కలలరాకుమారుడు ఒక అమ్మాయి జీవితంలో తారసపడితే అనే పాయింట్ చుట్టూతిరుగుతుందని చెప్తున్నారు. అలాగే దర్శకుడు ఈ చిత్రంలో ఊహకు అందని నావెల్ ఉందని చెప్తున్నారు. ఇక తాప్సీది బబ్లీగా ఉండే పాత్ర. మంచు విష్ణు వర్ధన్, తాప్సి కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రంలోని పాటలు ఇటీవలే విడుదలయ్యాయి.
అలాగే ఈచిత్రం పబ్లిసిటీ కోసం విభిన్నమైన మార్గంలో ముందుకెళ్లి పోటీ పెట్టారు. ఈ విషయమై విష్ణు వివరిస్తూ... ఈ పాటల సీడీలో ఓ ఫొటో ఉంచాం. అయితే అది పూర్తిగా ఉండదు. ఆ ఫొటోని మూడు ముక్కలుగా చేశాం. అయితే ఆ మూడు ముక్కలూ ఉండేవి కేవలం పది సీడీల్లోనే. ఆ సీడీలు పొందినవారు ముక్కల వెనక ఉన్న చిరునామాకి తమ వివరాలు తెలియజేస్తే... మా చిత్ర బృందం వారింటికి వెళ్తుంది. ఇటీవలే చిత్రంలోని గీతాల్ని మయూరి ఆడియో ద్వారా విడుదల చేశాం. మణిశర్మ స్వరపరచిన ఈ గీతాలు అందరికీ నచ్చుతున్నాయ న్నారు. సమర్పణ: మోహన్‌బాబు, నిర్మాణం: 24 ఫ్రేమ్స్.


Click it and Unblock the Notifications











